BigTV English

Lebanon: అక్కడ యుద్ధ వాతావరణం.. ‘వెంటనే స్వదేశానికి వచ్చేయండి’

Lebanon: అక్కడ యుద్ధ వాతావరణం.. ‘వెంటనే స్వదేశానికి వచ్చేయండి’

Israel: హమాస్ చీఫ్, ఇరాన్ మద్దతు ఉండే హెజ్బోల్లా బాధ్యుడిని ఇజ్రాయెల్ ఇటీవలే బాంబులు వేసి చంపేసింది. పాలస్తీనాకు ముందు నుంచి ఇరాన్ మద్దతు ఇస్తూనే వస్తున్నది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌ను ఒక శత్రువుగానే చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా హెజ్బోల్లా చీఫ్‌ను ఇజ్రాయెల్ చంపడంతో ఇరాన్ రగిలిపోతున్నది. ఈ హెజ్బోల్లా గ్రూపు లెబనాన్‌కు చెందినది. కాబట్టి, లెబనాన్ తరఫున ఇరాన్ ఎప్పుడైనా దాడికి దిగవచ్చునని, ఇజ్రాయెల్ వారిని చంపడం ఒక రకంగా ఇరాన్‌ను రెచ్చగొట్టినట్టే అవుతుందని భయపడుతున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో ఎప్పుడైనా యుద్ధం సంభవించవచ్చుననే భయాందోళనలు నెలకొన్నాయి.


కాబట్టి, ప్రపంచ దేశాలు లెబనాన్‌లోనూ యుద్ధ వాతావరణం నెలకొనే ముప్పు ఉన్నదని, కాబట్టి, ఆ దేశం నుంచి పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచనలు ఇస్తున్నది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తక్షణమే పౌరులు ఆ దేశాన్ని వదిలిపెట్టి స్వదేశానికి వచ్చేయాలని ఆదేశించాయి. ఏ ఫ్లైట్ అందుబాటులో ఉన్నా.. వెంటనే వెనక్కి వచ్చేయాలని కోరాయి. జర్మనీ, కెనడా దేశాలు కూడా తమ పౌరులను స్వదేశానికి వచ్చేయాలని, లెబనాన్‌లో పరిస్థితులు వేగంగా దిగజారిపోయే ముప్పు ఉన్నదని హెచ్చరించాయి.

Also Read: భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలి.. మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి


భారత్ కూడా లెబనాన్‌లోని దేశ పౌరులను హెచ్చరించింది. లబెనాన్‌కు అత్యవసరమైతేనే ప్రయాణించాలని, లేదంటే లెబనాన్ వెళ్లొద్దని తెలిపింది. లెబనాన్‌లోని భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ దేశంలోనూ ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. నిరంతరం బీరుట్‌లోని భారత ఎంబసీకి కాంటాక్ట్‌లో ఉండాలని ఆదేశించింది.

ఉత్తర మేసిడోనియా, కువైట్, డచ్ కంట్రీ కూడా తమ పౌరులను వెంటనే స్వదేశానికి రావాలని ఆదేశించాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×