Viral News: సమయం మన జీవితంలో అత్యంత విలువైనది. అందుకే ప్రతి క్షణం మనకు అమూల్యమైనది. అందుకే మనం ఎప్పుడు అంటుంటాం సమయం ఎంత వేగంగా గడుస్తోందో అని. మనం సాధారణంగా అనే ఈ మాటను గ్రీస్‌లోని అథోస్ పర్వతంలో శతాబ్దాలుగా నివసిస్తున్న సన్యాసులు నిజమే అంటున్నారు. వారు చేసిన పరిశీలనలు దీనికి నిదర్శనం.
కానీ ఇది కేవలం ఆధునిక మనుషుల భ్రమ మాత్రమే కాదని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాయి. ఆ మఠాల్లో వారు రోజంతా చేసే పనులు ఒక నిర్దిష్ట శ్రేణి పద్ధతి, సమయానికి ఒక లెక్క ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు ప్రార్థనలతో, ఆచారాలతో గడిపే వారి జీవితం సమయంతో ముడిపడి ఉంటుంది. దీనికి కారణం వారు వాడే దీపాలు. అవును వీరు దీపాలతోనే సమయాన్ని అంచనావేస్తారు.
దీపాలతో సమయం గుర్తిస్తారా ఎలా?
అథోస్ పర్వతంలో నివసిస్తున్న సన్యాసులు సమయాన్ని దీపాల ద్వారా వెచ్చిస్తారు. ఈ దీపాలు వీరికి చాలా ప్రత్యేకమైనవి. శతాబ్దాలుగా ఒకే విధంగా తయారు చేసే ఆ దీపాలు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు వెలిగేలా చేస్తారు. ఆ విధానం ఇప్పటికీ మారలేదు. కానీ ఇప్పుడు విచిత్రంగా అదే దీపాలు ఇరవై నాలుగు గంటల బదులు ఎక్కువ సేపు వెలిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒక దీపం పగలు రాత్రి కలిపి ఖచ్చితంగా ముగిసిపోతే, ఇప్పుడు అది మరుసటి రోజుకి కూడా కొంతసేపు వెలుగుతూ ఉంటుంది. దీంతో వారికి అనుమానం పెరిగింది. వారు గమనించింది ఏమిటంటే, నిజంగానే సమయం తన దినచర్యను మార్చుకుంటుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
Also Read: Medaram Festival: మేడారం పర్యటనకు మంత్రి సీతక్క సమీక్ష.. సీఎం రేవంత్ పర్యటనకు సన్నాహాలు
ప్రార్థించే సమయంలో కూడా మార్పులు
ప్రార్థనల సమయంలో కూడా ఇదే గమనిస్తున్నారు. ఒక గంటలో పూర్తయ్యే పాఠాలు ఇప్పుడు అదే రీతిలో చదివినా సమయానికి సరిపోవడం లేదు. అంటే వారు చేసిన పనులు, ప్రార్థనలు సమయం ఎక్కువగా అవుతుందని గమనించారు. దీని అర్థం ఏమిటంటే, మనం వాడే గడియారం ఒకే విధంగా కదులుతున్నా, జీవితం అనుభవిస్తున్న సమయం వేరేలా ఉండవచ్చని అనిపిస్తోంది.
24 గంటలు కాదు 18 గంటలే
1968లో ఒక రోజు 24 గంటలుగా ఖచ్చితంగా లెక్కపెట్టారు. కానీ 2025 నాటికి అదే కొలతలో ఒక రోజు కేవలం పదిహేనున్నర గంటల నుండి 18 గంటల వరకే సరిపోతుందన్న భావన ఈ సన్యాసులకు కలుగుతోంది. దీని వెనుక కారణం ఏమిటో ఇప్పటివరకు ఎవరు స్పష్టంగా చెప్ప లేకపోయారు. కొందరు ఇది భూమి భ్రమణంలో వచ్చే మార్పులు కావచ్చని అంటున్నారు. మరికొంతమంది పరిశోధకులు, సమయం వేగంగా అనిపించడంలో విశ్వంలో జరిగే పెద్ద మార్పులు కూడా కారణమని భావిస్తున్నారు
ప్రస్తుత విశ్లేషకులు దీన్ని ఒక కాల పరిణామంగా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మనం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు సమయం కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటుందని వారు నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం దీనిని ఇంకా నిర్ధారించ లేకపోయారు. కానీ అథోస్ పర్వత సన్యాసుల అనుభవం మాత్రం ఆలోచన గురిచేస్తుంది.
మన గడియారాల్లో కనిపించే సమయం ఒకటైతే, విశ్వం అనుభవిస్తున్న సమయం వేరే కావచ్చు. ఈ ప్రశ్న ఇప్పటికీ రహస్యంగానే ఉంది. సమయం నిజంగానే వేగంగా గడుస్తోందా లేక మన అనుభవమే మాయలోకి నెట్టుతోందా అనేది మనందరినీ ఆశ్చర్యపెడుతున్న ప్రశ్నగానే మిగిలిపోతోంది.