దేశంలో రోజు రోజుకు మహిళా వ్యభిచారుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఎక్కువ మంది మహిళా వ్యభిచారులు ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తొంది. దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 651 జిల్లాల్లో ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజు ఎస్టిమేషన్(PMPSE) ఈ సర్వే నిర్వహించింది. తాజా అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 9,95,499 మహిళా వ్యభిచారులు ఉన్నట్లు తేలింది. వీరిలో 53% మంది కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు వెల్లడైంది.
మహిళా వ్యభిచారులు ఎక్కువగా ఉన్న 5 రాష్ట్రాలు
1. కర్ణాటక – 15.4% (సుమారు 1,53,307 మంది): కర్ణాటక అత్యధిక మంది మహిళా వ్యభిచారులు ఉన్న రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. దేశంలో అత్యధిక హాట్‌స్పాట్‌లు (20%) కర్ణాటకలో ఉన్నాయి. ఇది మొత్తం ఫీమేల్ సెక్స్ వర్కర్స్ జనాభాలో 15.4% కలిగి ఉంది.
2. ఆంధ్రప్రదేశ్ – 12.0% (సుమారు 1,19,460 మంది): తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ కూడా అత్యధిక మంది మహిళా వ్యభిచారులు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. సామాజిక, ఆర్థిక సవాళ్ల కారణంగా చాలా మంది మహిళలు ఈ వృత్తిని ఎంచుకుంటున్నట్లు తేలింది. తాజా అధ్యయం ప్రకారం ఏపీలో సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు.
3. మహారాష్ట్ర – 9.6% (సుమారు 95,568 మంది): మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో మహిళా వ్యభిచారులు ఉన్నారు. ముంబైలోని కామాఠిపురా లాంటి రెడ్ లైట్ ఏరియాల్లో ప్రతి ఏటా వీరి సంఖ్య పెరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
4. ఢిల్లీ – 8.9% (సుమారు 88,599 మంది): దేశ రాజధాని ఢిల్లీలోనూ మహిళా వ్యభిచారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. జి.బి. రోడ్ లో పెద్ద సంఖ్యలో ఈ వృత్తి చేసే మహిళలు ఉన్నారు. ఇక్కడ ఒక హాట్ స్పాట్‌కు సగటున 26 మంది మహిళా వ్యభిచారులు ఉన్నట్లు అధ్యయనాలు తెలిపాయి.
5. తెలంగాణ – 7.6% (సుమారు 75,658 మంది): ఎక్కువ మంది మహిళా వ్యభిచారులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో నిలిచింది. ఒక హాట్ స్పాట్‌కు సగటున 38 ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ దేశంలో అత్యధిక హాట్‌స్పాట్ సాంద్రతను కలిగి ఉంది.
హాట్ స్పాట్‌లు: ఇక దేశ వ్యాప్తంగా 43,579 వ్యభిచారుల హాట్ స్పాట్లు ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో 55.1% మంది మహిళలు ఇళ్లలోనే వ్యభిచారం చేస్తున్నారు. 16.1% రోడ్ల పక్కన నిలబడి వ్యభిచారం చేస్తున్నారు. 5.9% వ్యభిచార గృహాల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
Read Also: ఈ పక్షి మన ‘టిల్లు’ మూవీలో రాధిక టైపు.. గుడ్లు పెట్టడం వరకే దీని బాధ్యత.. తర్వాత?
దేశంలో వ్యభిచార కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ITPA 1956 యాక్ట్ కింద నియంత్రించబడుతుంది. వ్యక్తిగతంగా, సమ్మతితో చేసే వ్యభిచారం చట్టబద్ధం. కానీ, బ్రోతల్ హౌజ్ లు నడపడం చట్టవిరుద్ధం. 2022లో సుప్రీం కోర్టు వ్యభిచారులకు గౌరవప్రదమైన జీవనం, సమాన చట్ట రక్షణ కల్పించాలని ఆదేశించింది.
Read Also: బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు మాయం, వామ్మో ఇంత మోసమా?