Ketika Sharma: ఎవరి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ప్లాప్ కావచ్చు. ఎంతో పేరు వస్తుందనుకున్న హీరోయిన్ కు అస్సలు గుర్తింపు రాకపోవచ్చు. కానీ, ఏదో ఒక రోజు కచ్చితంగా వారు ఒక మంచి విజయాన్ని అయితే అందుకుంటారు. ప్రస్తుతం కేతిక శర్మ ఇలాంటి సక్సెస్ నే అందుకుంది. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు. అమ్మడి అందం, అభినయం అంతా ఉన్నా కూడా ఈ సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.
ఇక ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల సరసన కేతిక అవకాశాలు పట్టింది గానీ, విజయాలను మాత్రం దక్కించుకోలేకపోయింది. మెగా మేనల్లుళ్లు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తజ్ సరసన నటించిన కూడా ఆమెకు హిట్ దక్కలేదు. సినిమాలు హిట్ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కిర్రెక్కించేస్తూ ఉంటుంది. పాప.. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసుకోవడమే అని, కేతిక తెలుగుకు దూరమవుతుందని అనుకునే సమయంలో రాబిన్ హుడ్ తో అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది.
అదిదా సర్ప్రైజ్ అంటూ కేతిక శర్మ ఐటెం సాంగ్ లో మెరిసి ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సాంగ్ వల్లన సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేది తెలియదు కానీ, ఈ సాంగ్ మాత్రం కేతిక కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ సాంగ్ వల్ల వచ్చిన హైప్ తో ఆమె నటించిన సింగిల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సింగిల్ హిట్ తరువాత కేతికకు అవకాశాలు వెల్లువెత్తాయి. రవితేజ నటిస్తున్న అనార్కలి సినిమాలో కూడా కేతిక సెలెక్ట్ అయ్యిందని టాక్ నడుస్తోంది.
ఇదే కాకుండా ఇప్పుడు కేతిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమాలో ప్రశాంత్ నీలో ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సాంగ్ కోసం బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేశారట.. కానీ, చివరకు ఆ ఆఫర్ కేతిక శర్మ కొట్టేసినట్లు సమాచారం.
ఎన్టీఆర్ సరసన స్టెప్స్ వేయడానికి కేతిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే కేతికకు ఇది పెద్ద అవకాశం. ఇందులో గనక ఎన్టీఆర్ తో సమానంగా అమ్మడు స్టెప్స్ వేయగలిగితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే కేతికను డ్రాగన్ లోకి అధికారికంగా ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో కేతిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.