Niharika:నిహారిక కొణిదెల (Niharika Konidela).. మెగా డాటర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ అమ్మడు మొదట బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నటన మీద ఆసక్తితోనే పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇక దాంతో పెద్దలు కుదుర్చిన వివాహాన్ని చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డ తో ఏడడుగులు వేసిన ఈమె అటు పర్సనల్ లైఫ్ లో బిజీ అవుతుందనుకుంటే.. విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనం సృష్టించింది. ఇకపోతే విడాకుల తర్వాత కూడా వెకేషన్స్ లో ఫ్రెండ్స్ ,ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఈమె మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.
అందులో భాగంగానే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్’ ను స్థాపించి ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఇక ఈ చిత్రంతో పాటు హీరోయిన్ గా నిహారిక ఒక తమిళ్ సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక దీంతో కొన్ని రోజులపాటు సైలెంట్ అయినా ఈ అమ్మడు.. మళ్లీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది.
తాజాగా తన నిర్మాణ సంస్థ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ హౌస్ లో చండీ హోమం చేసింది. వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ నడుమ స్వయంగా పూజలో పాల్గొనింది నిహారిక. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజెన్స్ ఈమె హోమం చేయించడానికి కారణం ఏంటి? అందులోనూ ప్రొడక్షన్ హౌస్ లో ఇలా పూజలు జరపడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే తన నిర్మాణ సంస్థలోనే పూజలు జరిపించి ఇప్పుడు వార్తల్లో నిలిచింది నిహారిక.
నిహారిక కెరియర్..
నిహారిక కెరియర్ విషయానికి వస్తే.. మొదట యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టింది. అక్కడ పలు షోలు చేసి బాగానే సక్సెస్ అయ్యింది. అయితే హీరోయిన్ గా రాణించాలనుకున్న ఈమె.. అందులో భాగంగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరో నాగశౌర్య (Naga Shourya)తో కలిసి ‘ఒక మనసు’ సినిమా చేసింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది కానీ ఎందుకో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తర్వాత ‘సూర్యకాంతం’ వంటి సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇక తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది నిహారిక. అలా చిన్న చిన్న పాత్రలతోనైనా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంది. కానీ నటిగా సక్సెస్ కాకపోవడంతోనే ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తన ప్రొడక్షన్ బ్యానర్లో మరిన్ని చిత్రాలు నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకోవాలనే ఈ హోమం జరిపించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ:HHVM: పవన్ మూవీకి అమెజాన్ ప్రైమ్ గట్టి ఝలక్.. పాపం రత్నంకు మరో రూ.20 కోట్లు లాస్ ?
?utm_source=ig_web_copy_link