Male Brid Carry babies: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పక్షులు ఉంటాయి. వాటిలో కొన్ని విచిత్రమైన పనులు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి జకానా పక్షిజాతి. ఈ జాతిలో గుడ్లు పెట్టడం మాత్రమే ఆడ పక్షుల పని. వాటిని పొదగడం, పిల్లలను సంరక్షించడం, వాటిని పెంచి పెద్ద చేయడం లాంటి పనులన్నీ మగపక్షులే చూసుంటాయి. ఈ పక్షులు మన ఇండియాకు చెందినవే కావడం విశేషం. వీటిలో ప్రధానంగా రెండు జాతులు ఉన్నాయి. ఒకటి ఫీసెంట్-టైల్డ్ జకానా (Hydrophasianus chirurgus) కాగా, మరొకటి బ్రాంజ్-వింగ్డ్ జకానా (Metopidius indicus).
కుటుంబ బాధ్యత మోసే మగ జకానా
⦿ గుడ్ల పొదిగే బాధ్యత: జకానా జాతి ఆడ పక్షి జల్సాగా ఎంజాయ్ చేస్తుంది. నచ్చిన మగ పక్షితో ఎంజాయ్ చేస్తుంది. గుడ్లను పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో మగ పక్షితో జతకడుతుంది. మగ పక్షి ఆ గుడ్లను పొదిగే బాధ్యతను తీసుకుంటుంది.
⦿ పిల్లల సంరక్షణ: గుడ్లు పొదిగిన తర్వాత మగ జకానా పిల్లలను రక్షిస్తుంది. కొన్ని సందర్భాల్లో, మగ పక్షి పిల్లలను తన రెక్కల కింద దాచి, ప్రమాదాల నుండి కాపాడుతుంది.
⦿ ఆడ జకానా: ఆడ జకానా సాధారణంగా కొద్ది రోజుల పాటు గూడును రక్షించడంలో సహాయం చేస్తుంది, కానీ, మరొక మగ పక్షితో సంభోగం పెట్టుకుని వెళ్లిపోతుంది.
గుడ్లను పొందిగే ఇతర మగ పక్షులు!
జకానా పక్షులతో పాటు, కొన్ని ఇతర పక్షి జాతులలో కూడా మగపక్షులు గుడ్లను పొదుగుతాయి. పిల్లలను సంరక్షించే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
⦿ ఈము (Emu): ఆస్ట్రేలియాకు చెందిన ఈ జాతిలో మగ ఈము గుడ్లను పొదుగుతుంది. దాదాపు 8 వారాల పాటు ఆహారం లేకుండా పిల్లలను సంరక్షిస్తుంది.
⦿ ఆస్ట్రిచ్ (Ostrich): మగ ఆస్ట్రిచ్ రాత్రి సమయంలో గుడ్లను పొదిగి, ఆడ పక్షితో సంరక్షణ బాధ్యతలను పంచుకుంటుంది.
⦿ రియా (Rhea): దక్షిణ అమెరికాకు చెందిన ఈ పక్షిలో కూడా మగవి గుడ్లను పొదిగి, పిల్లలను సంరక్షిస్తాయి.
⦿ ఎంపెరర్ పెంగ్విన్ (Emperor Penguin): అంటార్కిటికాలో మగ పెంగ్విన్ గుడ్డును తన కాళ్లపై ఉంచి, చల్లని వాతావరణంలో పొదిగే సమయంలో రక్షిస్తుంది, ఆడ పక్షి ఆహారం కోసం వెళ్తుంది.
Read Also: వామ్మో ఇదేం ఇండియన్ బీచ్, నెట్టింట ఫారినర్ వీడియో వైరల్!
జకానా పక్షుల గురించి..
⦿ జకానా పక్షులలో ఆడవి మగవి కంటే పెద్దవిగా ఉంటాయి.
⦿ మగ జకానా పిల్లలను రక్షించడానికి రెక్కల కింద దాచి పెడుతుంది.
⦿ ఈ పక్షులు దేశంలో చిత్తడి నేలలు, చెరువులు, లిలీ ప్యాడ్‌లతో వతావరణంలో సాధారణంగా కనిపిస్తాయి. కీల్ డీ బర్డ్ స్యాంక్చురీ (తమిళనాడు), రంగనాథిట్టు (కర్ణాటక)లో ఎక్కువగా ఉంటాయి.
Read Also: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఎగిరి వంతెనను పట్టుకుని.. ఏం జంప్ చేశావ్ గురూ!