BigTV English
Advertisement

US Woman: కేవలం రూ.85తో ఇల్లు కొనేసింది.. కానీ, దాని రెన్నోవేషన్‌కు ఎంత అయ్యిందో తెలిస్తే.. ఏమైపోతారో!

US Woman: కేవలం రూ.85తో ఇల్లు కొనేసింది.. కానీ, దాని రెన్నోవేషన్‌కు ఎంత అయ్యిందో తెలిస్తే.. ఏమైపోతారో!

కొంత మంది చేసే పనులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన కూడా అలాంటిదే. అమెరికాకు చెందిన ఓ మహిళ తమ పూర్వీకుల ఇంటిని కేవలం రూ. 85కే కొనుగోలు చేసింది. కానీ, దాన్ని పూర్తిగా పునర్నిర్మించేందుకు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


వేలం పాటలో పురాతన ఇంటి కొనుగోలు

విదేశీయులలో చాలా మంది చారిత్ర నేపథ్యం ఉన్న కట్టడాలను ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తారు. వాటికి ఆధునిక హంగులను అద్ది అద్భుతంగా తయారు చేసుకుంటారు. అచ్చం ఇలాగే ఇటలీలోని సిసిలియన్ గ్రామంలో 17వ శతాబ్దానికి చెందిన ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటిని 2019లో వేలం వేశారు. పూర్తిగా శిథిలావస్తకు చేరిన ఆ ఇంటిని అమెరికాలోని చికాగోకు చెందిన మెరెడిత్ టాబోన్ అనే మహిళ కొనుగోలు చేసింది. వేలం పాటలో ఆమె కేవలం 1.05 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో కేవలం రూ. 85కు దక్కించుకుంది. ఆ తర్వాత ఆ ఇంటిని రెన్నొవేషన్ చేయాలని నిర్ణయించింది.


రూ. 4 కోట్లతో రెన్నొవేషన్

ఇంటిని పునర్నిర్మించే వారిని సంప్రదించింది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఇంటిని రెన్నోవేషన్ చేయించింది. ఇందుకోసం ఆమె ఏకంగా సుమారు రూ. 4 కోట్లు ఖర్చు చేసింది. ఇంతకు ముందు ఇంటికి కరెంటు, నీటి సరఫరా లేదు. కానీ, ప్రస్తుతం ఆ ఇంటికి అన్ని వసతులను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నది. అంతేకాదు, ఆమె కొనుగోలు చేసిన ఇల్లు చిన్నగా ఉండటంతో పక్కనే ఉన్న మరో ప్లేస్ ను సుమారు రూ. 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండింటిని కలిపి అద్భుతంగా పునర్నిర్మించింది. చారిత్రక ఆనవాళ్లు చెడిపోకుండా కాపాడుతూనే, ఈ ఇంటికి నూతన హంగులను అద్దింది.

పూర్వీకుల జ్ఞాపకాలకు గుర్తుగా..

ఇక తమ పూర్వీకులు జ్ఞాపకాలకు గుర్తుగానే ఈ ఇంటిని అద్భుతంగా రెన్నోవేషన్ చేయించినట్లు మెరిడిత్ చెప్పుకొచ్చింది. “1908లో మా ఫ్యామిలీ అమెరికాకు వెళ్లక ముందు తమ తాతలు ఈ ప్రాంతంలోనే నివాసం ఉండేవారు. వారి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ ఇంటిని కొనుగోలు చేశాను. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఇంటిని అద్భుతంగా రెన్నోవేషన్ చేయించాను. ఈ ఇల్లును చూస్తే నాకు మా పూర్వీకులు గుర్తొచ్చేలా డిజైన్ చేయించుకున్నాను” అని మెరిడిత్ చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఇక తన ఇంటికి సంబంధించిని పాత ఫోటోలు, రెన్నోవేషన్ తర్వాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది మెరిడిత్. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంట్లో అద్భుతంగా రూపొందించిన డిజైన్, ఇంటీరియర్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. అభిరుచికి తగినట్లుగా ఈ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దారు అంటూ నెటిజన్లు మెరిడిత్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు పూర్వీకులు జ్ఞాపకాలు, మరోవైపు ఆధునిక డిజైన్ చాలా బాగుంది అంటున్నారు.

 

View this post on Instagram

 

Read Also: రూ.10 విలువ చేసే వాటర్ బాటిల్ ధర 100 రూపాయలా? నిప్పులు చెరిగిన నెటిజన్లు, స్పందించిన జొమాటో!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×