PANI PURI OFFER | జీవనోపాధి కోసం మనుషులు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తే.. మరి కొందరు వ్యాపారాలు చేస్తుంటారు. ఈ రెండో కోవలో చాలా రిస్క్ ఉంటుంది. కానీ వ్యాపారంలో రాణించాలంటే శ్రమతో పాటు విన్నూత్నంగా కూడా ఆలోచించాలి. ఆ విధంగా బిజినెస్ ప్రణాళికలు రూపొందించి.. వాటిని సందర్భాను సారంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఇదే చేస్తుంటాయి. అయితే చిరు వ్యాపారులు కూడా తమ స్థాయికి తగ్గటు బిజినెస్ చేస్తుంటారు. అలా ఆలోచించిన ఒక వ్యక్తి తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. అతనే నాగ్ పూర్ కు చెందిన ఒక చిరువ్యాపారి విజయ్ మేవాలాల్. ఆయన ఒక పానీ పూరీ వ్యాపారం చేస్తున్నాడు.
తన పానీ పూరీ వ్యాపకంలో వినియోగదారులకు ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఆఫర్ల ప్రకటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పానీపూరీ తయారీలో మరియు రెసిపీలో కొత్తదనం లేకపోయినా, వినూత్నమైన ఆఫర్లను ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాడు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని విజయ్ మెవాలాల్ గుప్తా పానీపూరి ఔట్‌లెట్ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రూ.99 వేలు చెల్లిస్తే జీవితకాలం ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని ఆఫర్‌ను విజయ్ మెవాలాల్ ప్రకటించాడు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్‌ను ఎంచుకున్నారని ఆయన తెలిపాడు. ద్రవ్యోల్బణం, ప్రతి సంవత్సరం పానీపూరీల మీద ఖర్చు చేసే మొత్తాన్ని పోలిస్తే, ఈ ఆఫర్ చాలా చవకగా ఉందని ఆయన వివరిస్తున్నాడు.
“రూ.99 వేల ఆఫర్‌పై ప్రజల స్పందన చాలా బాగుంది. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్‌ను ఎంచుకున్నారు. రెండు, మూడు నెలల నుంచి చాలా మంది ఈ ఆఫర్ గురించి చర్చిస్తున్నారు. రోజుకు గోల్‌గప్పా మీద రూ.100 ఖర్చు చేస్తే, నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేలు ఖర్చవుతుంది. 10 ఏళ్లలో రూ.3 లక్షల 60 వేలు ఖర్చవుతుంది. కానీ మేము రూ.99 వేలకే జీవితకాలం తినేలా ఆఫర్‌ను ప్రకటించాం. ఈ ఆఫర్‌ను కస్టమర్లు ఇష్టపడుతున్నారు మరియు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు,” అని విజయ్ మెవాలాల్ గుప్తా తెలిపాడు. వీటితో పాటు వీక్లీ ప్యాకేజీ కింద రూ.600 కడితే ఆ వారంలో ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని, అలాగే మంత్లీ ఆఫర్ కూడా ఉంటుందని వెల్లడించాడు.
Also Read: వారానికి 70 గంటలు పనిచేసిన ఐటి ఉద్యోగి.. విడాకులు కావాలంటున్న భార్య!
మహారాష్ట్రలో మహిళలకు ఆర్థిక సహాయం అందించే లాడ్‌లీ బహనా యోజన మరియు మహాకుంభమేళా పేరిట కూడా ఆయన ఆఫర్లను ప్రకటించాడు. లాడ్‌లీ బహనా యోజన లబ్ధిదారులు 60 రూపాయలు చెల్లించి ఎన్ని గోల్‌గప్పాలైనా తినొచ్చు. మహాకుంభమేళా కింద రూపాయికి 40 పానీపూరీలు తినొచ్చు. అయితే, ఒకేసారి 40 గోల్‌గప్పాలు తినాలని ఆయన షరతు పెట్టాడు. అలాగే, 195 రూపాయలు చెల్లించి నెల పాటు ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని మరో ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ ఆఫర్లు తనను ప్రసిద్ధి చేయడం సహా వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడ్డాయని విజయ్ మెవాలాల్ వివరిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చూసి ఇక్కడకు వచ్చామని కస్టమర్లు తెలిపారు.
“ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫర్ల గురించి తెలుసుకొని ఉత్సాహంతో ఇక్కడకు వచ్చాను. చిన్న ఆఫర్‌ను ప్రయత్నించాను. చాలా బాగుంది,” అని తేజస్విని అనే కస్టమర్ తెలిపారు.