DC vs MI: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Women’s Premier League 2025 Tournament ) రెండు రోజుల కిందట ప్రారంభం కాగా… ఇప్పటికే రెండు మ్యాచులు పూర్తయ్యాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే.. తెరపైకి కొత్త వివాదం వచ్చింది. Wpl 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ( Mumbai ) వర్సెస్ ఢిల్లీ ( Delhi ) మధ్య నిన్న అంటే శనివారం రోజున మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరలో ఓ రన్ అవుట్ వివాదంగా మారింది. అది అవుటని ముంబై అంటుంటే.. కాదు కాదు నాట్ అవుట్ అంటూ… ఢిల్లీ రచ్చ చేస్తోంది. ఇప్పుడు ఈ సంఘటన… సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: ICC Champions Trophy: 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ..ఇంత గ్యాప్ రావాడానికి కారణాలు ఇవే ?
క్లియర్ కట్ గా ఔట్ అయినప్పటికీ కూడా థర్డ్ అంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. థర్డ్ అంపైర్ మ్యాచ్ ఫిక్సింగ్ ( Third Umpire Match Fixing ) చేసుకున్నాడని కూడా అంటున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీ బ్యాటర్ అరుంధతి ( Arundhati ) కవర్స్ వైపు భారీ షాట్ ఆడింది. దీంతో రెండు పరుగులకు ప్రయత్నించింది అరుంధతి. ఈ నేపథ్యంలోనే కీపర్ వైపు బంతి విసిరారు. ఈ తరుణంలోనే అరుంధతి ( Arundhati ) గ్రీజ్ లో బ్యాట్ పెట్టే సమయానికి వికెట్ల బేయిల్స్ పడిపోయాయి. బ్యాట్ లైన్ పైన పెట్టేసరికి బేయిల్స్ గాల్లో ఎగిరినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం నాట్ అవుట్ గా ప్రకటించి పెద్ద వివాదానికి తెరలేపాడు. అరుంధతి నాటౌట్ కావడంతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కానీ ఈ రనౌట్ మాత్రం వివాదంగా మారింది ( Run-Out Controversy )
కాగా ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి 20 ఓవర్లు ఆడలేదు ముంబై. 19.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కష్టపడింది అని చెప్పవచ్చు. 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఈ మ్యాచ్ లో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైన్ అప్ ఒకసారి పరిశీలిస్తే శఫలి వర్మ 43 పరుగులతో రాణించారు. అలాగే నికి ప్రసాద్ 35 పరుగులు చేసి దుమ్ము లేపింది. అటు వికెట్ కీపర్ సారా కూడా 21 పరుగులు చేసి రాణించింది. అయితే చివర్లో రాధా యాదవ్ అలాగే అరుంధతి రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తనకు వచ్చిన ఒక్క బంతిని… ఆడి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చింది అరుంధతి రెడ్డి.
Also Read: Telugu Warriors: పప్పులో కాలేసిన అయ్యగారు..12 మంది ప్లేయర్లతో ఆడించాడు..!
This is the picture of final run out .
Why 3rd umpire was on hurry? @mipaltan was robbed .@BCCIWomen @wplt20
You must review the final decision made by 3rd umpire.@cricketaakash @Shebas_10dulkar @LoyalSachinFan @sanjaymanjrekar #WPL2025 pic.twitter.com/yBmLRmPEeu— A Billion Dreams (@Rohitian_hitman) February 15, 2025