BigTV English

Weekly 70 hours Work Divorce : వారానికి 70 గంటలు పనిచేసిన ఐటి ఉద్యోగి.. విడాకులు కావాలంటున్న భార్య!

Weekly 70 hours Work Divorce : వారానికి 70 గంటలు పనిచేసిన ఐటి ఉద్యోగి.. విడాకులు కావాలంటున్న భార్య!

Weekly 70 hours Work Divorce | ఆ ఐటి ప్రముఖలు చెప్పినట్లే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వారానికి 70 గంటలకు పైగా పనిచేశాడు. రూ.కోట్లలో జీతం పొందుతున్నాడు. చివరికి అతనికి మిగిలిందేంటి? ఇప్పుడతని భార్య విడాకులు ఇవ్వమని అతడిని అడుగుతోంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఆ టెక్కీ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. అయితే, ఈ సూచనకు కొందరు మద్దతు తెలిపితే, మరికొందరు విమర్శించిన వారూ ఉన్నారు. ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకు వేసి, “వారానికి 90 గంటలు పనిచేయండి. ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఓ టెక్కీ, “మీరు చెప్పినట్లుగా చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతుంది. మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది” అని సోషల్ మీడియా వేదికగా తన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

Also Read: మాజీ లవర్ పై రివేంజ్ తీర్చుకున్న యువతి.. వామ్మో, పిజ్జానే ఆయుధం..


ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ప్రముఖులు చెప్పినట్లుగా పనిచేసే వారి భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందేమోనని అనేకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పేరు ప్రస్తావించని ఓ టెక్కీ, అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ బ్లిండ్‌లో ఓ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. ఆ పోస్ట్‌లో, “నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కన్నాను. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మూడేళ్లపాటు అహర్నిశలు కష్టపడి పనిచేశాను. జూనియర్‌ నుండి సీనియర్ స్థాయికి ప్రమోషన్ పొందాను. జీతం, ప్రమోషన్ పెరిగే కొద్దీ పని కూడా పెరిగింది. నా విధుల్లో భాగంగా యురోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగులను సమన్వయం చేసుకోవలసి వచ్చేది. ఫలితంగా, ఆఫీస్ మీటింగ్స్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి. అది చాలదన్నట్లుగా కొన్నిసార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని. ఈ కష్టానికి ప్రతిఫలంగా మూడేళ్లకే సీనియర్ మేనేజర్‌గా ప్రమోషన్ పొందాను. ఏడాదికి రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను.

కానీ ఇప్పుడు నా భార్య నన్ను విడాకులు కోరుతోంది. ఇందుకు కారణం నేనే. ఆఫీస్ వర్క్ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో నేను దగ్గరలో లేకపోయాను. డెలివరీ తర్వాత కూడా ఆమెతో సరిగ్గా సమయం గడపలేకపోయాను. నా కూతురు పుట్టిన రోజులకు కూడా హాజరు కాలేకపోయాను. పాపం, నా భార్య డిప్రెషన్‌కు గురైంది. డిప్రెషన్ ఎక్కువైంది. డాక్టర్‌కు చూపించుకోవాలని అడిగేది, కానీ అది సాధ్యం కాలేదు. చివరికి ఈ బాధలను తట్టుకోలేక నా భార్య నన్ను విడాకులు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

‘నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో, ఏమి కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?’ అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు.

https://www.teamblind.com/post/My-L7-promo-was-approved-but-wife-asked-for-a-divorce-jxApr7ba

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×