BigTV English
Advertisement

Chandoo Mondeti : కంఫర్ట్ జోన్ వదిలేసి, పెద్ద ప్రాజెక్ట్ పట్టాడు

Chandoo Mondeti : కంఫర్ట్ జోన్ వదిలేసి, పెద్ద ప్రాజెక్ట్ పట్టాడు

Chandoo Mondeti : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో చందు మొండేటి ఒకరు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 2014లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. చందు మొండేటి కు దర్శకుడు సుధీర్ వర్మతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సినిమాకి సంబంధించి టెక్నికల్ గా చాలా విషయాలు సుధీర్ వర్మకు తెలుసు అని పలు ఇంటర్వ్యూస్ లో కూడా చందు చెబుతూ వచ్చాడు. కార్తికేయ సినిమా హిట్ అయిన తర్వాత నాగచైతన్య హీరోగా ప్రేమమ్ అనే సినిమాను తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. మలయాళం లో ప్రేమమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి రీమేక్ గా ప్రేమమ్ ను నిర్మించారు.


మళ్లీ నాగచైతన్య హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సవ్యసాచి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు చందు. ఈ సినిమాలో మాధవన్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా విపరీతమైన అంచనాలతో విడుదలైంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి ఊహించిన సక్సెస్ రాలేదు. ఇక మళ్లీ నిఖిల్ హీరోగా కార్తికేయ 2 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చందు మొండేటి కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత చందుకి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్ వంటి హీరోకు కూడా కథను చెప్పాడు చందు. అయితే ఎప్పటినుంచో సూర్యతో చందు సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు చందు. నాగచైతన్య కెరియర్ లో ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాపై కూడా అక్కడక్కడ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక చందు నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్యతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యని తెలుగు ఎప్పుడో ప్రేక్షకులు అడాప్ట్ చేసుకున్నారు. సూర్య తమిళ్ హీరో అని చాలామంది ప్రేక్షకులకు కూడా తెలియదు అనేది అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటిసారి సూర్య సినిమా చేయటం చాలామందికి ఆసక్తిని కలిగిస్తుంది. చందు మొండేటి ఏ స్థాయి సక్సెస్ ఇస్తాడో వేచి చూడాలి. నిఖిల్, నాగచైతన్య తప్ప ఇప్పటివరకు చందు మరో హీరోతో సినిమాను చేయలేదు. ఇక మొదటిసారి తన కంఫర్ట్ హీరోస్ ను వదులు పెట్టి భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు చందుకు ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాల్సి ఉంది.


Also Read : Kalyan Dev: మళ్లీ ప్రేమలో పడ్డ మెగా అల్లుడు..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×