Nun Garba Dance: దాండియా, గర్బా గుజరాత్ తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో పండుగల సమయంలో చేసే సాంస్కృతిక నృత్యాలు. రంగు రంగుల సంప్రదాయ దుస్తులు ధరించి డప్పు శబ్దాలకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తుంటారు. నవరాత్రుల సందర్భంగా ఉత్తర భారతదేశంలో గర్బా నృత్యాలు చేయడం సహజం. మధ్యప్రదేశ్ భోపాల్ లో నిర్వహించిన గర్బా ఈవెంట్ లో ఓ మహిళ హాలీవుడ్ సినిమా ‘నన్’ లోని వేషధారణలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సౌరభ్ కహార్ అనే ఇన్ ఫ్లూయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ వీడియోలో ‘నన్’ దుస్తులలో ఉన్న మహిళ ఇతరులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమె లయబద్ధంగా నృత్యం చేస్తున్నప్పటికీ, ఆమె వేషధారణ భయపెట్టేలా ఉంది. అయితే చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఆమె వేషం చూసి నవ్వుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియో కనిపించడం ఇదేం మొదటిసారి కాదని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు దుస్తుల ఎంపికపై విమర్శలు చేస్తున్నారు. పండుగ సమయాల్లో అలాంటి దుస్తులు సరికాదని, అలాంటి వారిని గర్బాలోకి అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు.
ఇదేం ఫ్యాన్సీ డ్రెస్ పోటీ కాదు. నవరాత్రి అంటే శక్తి స్వరూపాన్ని పూజించడం, భయంకరమైన మేకోవర్లు కాదని మరికొందరు కామెంట్ చేశారు. ఇదేం హాలోవీన్ నైట్ కాదు, దయచేసి అర్థం చేసుకోండని మరో వ్యక్తి ఈ వీడియోపై స్పందించారు.
?utm_source=ig_web_copy_link
నన్ రూపంలో డ్యాన్స్ మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. దీనిని కొందరు వినోదం చూస్తుంటే, మరికొందరు నవరాత్రి సమయంలో సాంస్కృతిక సంప్రదాయాలు పట్టవా? అంటూ ప్రశ్నలను లేవనెత్తున్నారు
నవరాత్రి సమయంలో దాండియా, గర్బా కేవలం డ్యాన్స్ మాత్రమే కాదని, కొత్త స్నేహాలను, బంధాలను ఏర్పరచుకోవడానికి ప్రతీకగా చెబుతున్నారు. నలుగురూ కలిసి ఆనందంగా జరుపుకునే కార్యక్రమం గర్బా అంటున్నారు.
దేశ వ్యాప్తంగా నవరాత్రి దుర్గా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఆధ్యాత్మికతతో వెలిగిపోతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే సందర్భం నవరాత్రి సంబరాలు చేసుకుంటున్నారు.