తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అంటారు. ఏం చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అంటారు. కనిపెంచిన పేరెంట్స్ ను కంటికి రెప్పలా చూసుకోవాలంటారు పెద్దలు. కానీ, కొంత మంది పిల్లలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. కని పెంచిన తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు కిరాతకులుగా మారుతున్నారు. కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. తల్లిని దారుణంగా కొడుతుకున్న కూతురిపై కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.?
హర్యానాలోతల్లిపై క్రూరంగా దాడి చేసిన కూతురు
హర్యానాలో దారుణ ఘటన జరిగింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని దారుణంగా చావగొట్టిందో దుర్మార్గపు కూతురు. కొట్టొద్దని ఆమె చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకున్నా కనికరించలేదు. జుట్టు లాగి, చెంప పగలగొట్టింది. కాలితో ఇష్టం వచ్చినట్లు తన్నింది. తల్లి శరీరంపై పలు చోట్ల కొరికింది. 3 నిమిషాల పాటు రాక్షసంగా వ్యవహరించింది. ఇటీవల ఈ ఘటన జరిగగా, తాజాగా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కన్నతల్లి పట్ల కన్నకూతురే ఇలాంటి దాష్టికానికి పాల్పడటంతో అందరూ షాక్ అవుతున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1895150401801863636
Read Also: పెళ్లికూతురి ఫ్రెండ్ మెడలో దండ వేసిన వరుడు.. చెంపవాచేలా కొట్టిన వధువు
కిరాతకురాలిని కఠినంగా శిక్షించాలంటున్న నెటిజన్లు
అటు ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట హల్ చల్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. నిస్సహాయురాలైన తల్లి మీద ఇలా కిరాతకంగా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి పిల్లల్ని కనడం కంటే, పుట్టగానే చంపేస్తే బాగుండేదని కామెంట్స్ పెడుతున్నారు. శాడిస్ట్ కూతురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై హర్యానా పోలీసులు స్పందించినట్లు తెలుస్తోంది. తల్లిని చిత్రహింసలకు గురి చేసిన కూతురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. ఈ నివేదిక అందగానే సదరు మహిళపై చర్యలకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: సర్కారు నౌకరీ ఉంటే చాలట.. ఈ అమ్మాయి భలే గమ్మత్ ఉందయ్యో!