OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. థియేటర్లకు సంబంధం లేకుండా వెబ్ సిరీస్ లు ఓటీటీ లో డైరెక్ట్ గానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లు ఓటిటిలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సీరియల్స్ ని చూడడం తగ్గించి, వీటిని ఎక్కువగా చూడడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. వీటిలో బెంగాల్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ వెబ్ సిరీస్, ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీ లలో
ఈ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘లొజ్జ’ (Lojja). ఈ వెబ్ సిరీస్ కి అదితి రాయ్ దర్శకత్వం వహించారు. భార్య భర్తల మధ్య జరిగే సంఘర్షణను ఈ మూవీలో కొత్తగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ (Hoichoi), (Airtel extreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జయ, జగదీష్ భార్య భర్తలకు అపూర్వ అనే కూతురు ఉంటుంది. వీరి వివాహం జరిగి 13 సంవత్సరాలు అవుతుంది. పెళ్లయిన కొత్తలో కొద్ది రోజులు బాగానే ఉండేవాడు జగదీష్. ఆ తర్వాత ఆమెను ఏ పని చేసినా తిట్టడం స్టార్ట్ చేశాడు. ప్రతి పనిలోనూ ఆమెను ఏదో వంక పెడుతూ తిడుతూ ఉండేవాడు. జయ కూడా ఎన్జీవో లో జాబ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో పని చేసుకుని, జాబ్ కి వెళ్లి తిరిగి వచ్చాక కూడా ఇంటి పనులు చేస్తున్నా కూడా ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు. కూతురు అపూర్వ కూడా తల్లి మీద జోకులు వేస్తూ ఉంటుంది. జయ అత్తగారు అపూర్వ కి లేనిపోనివి చెప్పి, తల్లి కూతుర్ల మధ్య కూడా దూరం పెంచుతుంది. ఇవన్నీ భరించలేక ఒకరోజు భర్తతో కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనిపిస్తుందని చెప్తుంది జయ. ఈ విషయం జయ కుటుంబ సభ్యులకు చెప్తాడు జగదీష్. జయను చూడటానికి తన అన్నయ్య వస్తాడు. అయితే ఆమెకు మెంటల్ గా ప్రాబ్లం ఉందని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తన అన్నయ్యకి జరిగిన విషయం చెప్పినా కూడా, మెంటల్ హాస్పిటల్ కి తీసుకురావడం జయను బాధిస్తుంది.
ఆ తర్వాత ఆమె బాధను అర్థం చేసుకొని, తనని ఇంటికి తీసుకువెళ్తారు కుటుంబ సభ్యులు. పుట్టింట్లో కూడా భర్త రెండు మాటలు అంటే ఏమవుతుందని, వాళ్లు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ భరించిన జయ ఒక్కసారిగా, తన బాధను వెళ్లగక్కుతుంది. అతను అనే మాటలు, అతడు హింసించే పద్ధతి వీళ్లకు చెప్పి బాగా ఏడుస్తుంది. ఇది విన్న ఆమె స్నేహితులు అతనిపై విడాకుల కేసు తో పాటు, గృహహింస కేసు కూడా పెట్టమంటారు. ఈ ప్రయత్నంలోనే ఆమె కోర్టు మెట్లు ఎక్కుతుంది. చివరికి జయ విడాకులు తీసుకుందా? భర్తకు గృహహింస చేశాడనే కారణంగా శిక్ష పడుతుందా? తన జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘లొజ్జ’ (Lojja) అనే ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.