E-Paper
Advertisement

Viral News: ఐసీయూలో భయానక దృశ్యం, చూస్తే, వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Viral News: ఐసీయూలో భయానక దృశ్యం, చూస్తే, వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Advertisement

అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతాయి. వాటిని చూసి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేకపోతున్నాం కూడా. తాజాగా ఓ హాస్పిటల్లోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఐసీయూలో కనిపించి ఆ దృశ్యాన్ని చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఐసీయూలో బాలుడి ఆత్మ!

మలేషియాలోని ఓ హాస్పిటల్ ఐసీయూలో బాలుడి ఆత్మ కనిపించిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ సీసీటీవీ పుటేజీలో  ఓ లేడీ పేషెంట్ బెడ్ దగ్గర చిన్న పిల్లాడి నల్లటి దృశ్యం కనిపించింది. ఆ ఆత్మను చూసి ముందు ఓ నర్సు భయంతో బయటకు పరుగులు తీస్తుంది. కానీ, ఆ  తర్వాత ఇద్దరు మనుషులు లోపలికి వస్తారు. అందులో ఓ వ్యక్తి ఆ ఆత్మను దాటుకుని ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ ఘటన మలేషియాలోని లాబువాన్ హాస్పిటల్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఆ హాస్పిటల్ కు చెందిన నర్సులు రోగి మంచం దగ్గర ఓ వింత నీడ కనిపించినట్లు ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పారు. వెంటనే వారు గదిలోకి వచ్చి చెక్ చేయగా అప్పటికే ఆ రూపం మాయం అయ్యింది. అదే సమయంలో మంచం మీద ఉన్న ఓ మహిళా రోగి కూడా తాను ఓ బాలుడిని కొద్ది గంటల ముందే చూశానని చెప్పాడు. కానీ, ఆమె మాటను ఎవరూ నమ్మలేదు.

సీసీ ఫుటేజీలో బయటపడ్డ అసలు విషయం!

Advertisement

హాస్పిటల్ నర్సులు, ఐసీయూ బెడ్ మీద ఉన్న మహిళా రోగి ఇదే విషయాన్ని చెప్పడంతో, ఎందుకైనా మంచిదని హాస్పిటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వారు చెప్పినట్లుగా ఓ బాలుడి నల్లటి దృశ్యం ఐసీయూలో కనిపించింది. విచిత్రం ఏంటంటే, బాలుడిని చూసినట్లు చెప్పిన మహిళా పేషెంట్ మరుసటి రోజే చనిపోయింది.  ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: కాలి నొప్పి అని లీవ్ పెట్టి పరిగెత్తుతావా? ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ, కోర్టు సంచలన తీర్పు!

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ ఘటనపై నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఈ విజువల్స్ ఏఐ క్రియేటెడ్ విజువల్ గా కొట్టి పారేస్తుండగా, మరికొంత మంది నిజమేనని నమ్ముతున్నారు. కొంతమంది వీక్షకులు ఈ ఘటనను పారానార్మల్ యాక్టివిటీ వల్ల జరిగిందంటున్నారు. ఇంకొంత మంది ఇది కెమెరా సమస్య వల్ల, లైటింగ్ ఎఫెక్ట్ తో అలా నల్లటి రూపం ఏర్పడి ఉండవచ్చని చెప్తున్నారు. మరికొంత మంది అది కచ్చితంగా బాలుడి ఆత్మ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇంతకీ ఆ దృశ్యం దెయ్యమా? కాదా? అనేదానికి అధికారిక, శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ వీడియో గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

Read Also: బర్రెల మీద పోలీసుల పెట్రోలింగ్, ఆ బాధ తప్పాలంటే ఇవే బెస్ట్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×