BigTV English

Viral News: గుండుతోనే పెళ్లి చేసుకున్న ఈ వధువు గురించి మీకు తెలుసా?

Viral News: గుండుతోనే పెళ్లి చేసుకున్న ఈ వధువు గురించి మీకు తెలుసా?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధుర జ్ఞాపకం. అందుకే, ఉన్నంతలో గొప్పగా పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. వాటిని చాలా మంది నెరవేర్చుకుంటారు కూడా. ఇక పెళ్లి రోజు నూతన వధూవరులు ఎంతో అందగా రెడీ అవుతారు. పట్టు దుస్తులు ధరించి, అందంగా మేకప్ చేయించుకుని పెళ్లి మండపంలోకి అడుగు పెడతారు. విద్యుత్ కాంతుల్లో బంగారు వర్ణంలో మెసిరిపోతూ కనిపిస్తారు. కానీ, ఓ వధువు గుండుతో పెళ్లి పీటలు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జీవిత కాలం గుర్తుండే వివాహ వేడుకలో వధువు గుండుతో కనిపించడం ఏంటి? అని షాకయ్యారు. కానీ, అసలు విషయం తెలిసి అందరూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు అలా రెడీ అవ్వాల్సి వచ్చిందంటే..


ఇండియన్ ఇన్ ఫ్లుయెన్సర్ షాకింగ్ డెసిషన్

అమెరికాలో ఉంటున్న ఇండియన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ నీహార్ సచ్ దేవా గురించి నెటిజన్లకు పెద్దగా పరిచయం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికాలోని లాస్ ఎంజెలెస్ లో ఉంటున్నది. రీసెంట్ గా తన బాల్య మిత్రుడిని పెళ్లి చేసుకుంది. ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి కాసేపట్లోనే బాగా వైరల్ అయ్యాయి. ఇందుకు కారణం ఆమె పెళ్లిలో గుండుతో కనిపించడం. విగ్గు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ..  గుండుతోనే పెళ్లి పీటల మీద కూర్చుకుంది. భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇంతకీ ఆమె గుండుతో ఎందుకు కనిపించాల్సి వచ్చింది? అని నెటిజన్లు ఆరా తీశారు. అసలు విషయం తెలిసి ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.


‘అలోపేసియా’తో బాధపడుతున్న నీహార్

నీహార్ సచ్ దేవ్ చిన్నప్పటి నుంచే ‘అలోపేసియా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా జుట్టు ఊడిపోతుంది. కొత్త జుట్టు వచ్చినప్పటికీ, అది ఎక్కువ రోజులు ఉండేది కాదు. కొంత కాలం తన సమస్యను బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. విగ్గు పెట్టుకుని మేనేజ్ చేసింది. కానీ, ఆమెకు చాలా విసుగ్గా అనిపించేది. గుండు చేయించుకోవడం బెస్ట్ అని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి గుండులోనే కనిపిస్తోంది. తన పెళ్లి రోజు కూడా విగ్గుతో కాకుండా, ఒరిజినల్ లుక్ లోనే కనిపించి ఆకట్టుకుంది. అందరూ ఆమె గెటప్ చూసి ముందుగా ఇదేంటి? అనుకున్నా, అసలు విషయం తెలిసి ప్రశంసిస్తున్నారు.

Read Also: మెట్రోలో మద్యం తాగిన యువకుడు..నెట్టింట వీడియో వైరల్!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు నిహార్ ను అభినందిస్తున్నారు. చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడుతారని, నిహార్ మాత్రం ధైర్యంగా తన సమస్యను బయటకు చెప్పే ప్రయత్నం చేసిందంటున్నారు. ‘బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ అంటూ ప్రశంసిస్తున్నారు. “నాకు కూడా అలోపేసియా ఉంది. నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలాగే నేనూ గుండుతో పెళ్లి పీటలు ఎక్కాలి అనుకుంటున్నాను” అని ఓ యువతి రాసుకొచ్చింది. ప్రస్తుతం నీహార్ ను నెటిజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు.

Read Also: నీలోఫర్ కేఫ్ ముందు చాయ్ బండిపెట్టిన యువకుడు.. భలే గిరాకీ గురూ!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×