BigTV English

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Liquor party: వాళ్ల మధ్య మనస్పర్థలు ఏ స్థాయికి వెళ్లాయంటే.. కోడలు స్నేహితులతో కలిసి మద్యం పార్టీకి వెళ్లింది. కానీ ఆ పార్టీ బెడిసికొట్టింది మామ చేసిన రివేంజ్‌ కాల్. ఫ్రెండ్‌షిప్ డే అని మొదలైన సైలెంట్ సెలబ్రేషన్.. చివరకు పోలీసుల ఎంట్రీతో హోటల్ గదిలోనే డ్రామాటిక్‌గా ముగిసింది. అసలేం జరిగిందంటే/


గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని డ్యూమస్ ప్రాంతంలో ఓ హోటల్ గదిలో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా యువతీ యువకులు కలిసి పార్టీ ప్లాన్ చేశారు. ఇది సాధారణంగా వినిపించినా, ఆ పార్టీకి కారణమైన ఘటన మాత్రం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే, ఈ పార్టీపై పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ పార్టీకి హాజరైన యువతిలో ఒకరి మామే.

వ్యక్తిగత కక్షతో పోలీసులకు టిప్ ఇచ్చిన మామ
పార్టీలో ఉన్న ఒక యువతిని సంబంధించిన కుటుంబ సమస్యలు, ఆమె భర్తతో వివాదాలు మామగారిని ఆగ్రహానికి తెచ్చాయి. కోడలు ఏం చేస్తున్నదో తెలుసుకోవాలని ఆరా తీసిన ఆయన, ఆమె స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్నట్టు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, బుద్ధి చెప్తానూ చూడు అన్నట్టుగా ఆమెపై రివేంజ్ తీర్చుకున్నారు.


‘వీకెండ్ అడ్రస్’ హోటల్‌పై దాడి
పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సూరత్ డ్యూమస్ పోలీస్ శాఖ సత్వర చర్యకు దిగింది. మంగళవారం రాత్రి వీకెండ్ అడ్రస్ అనే హోటల్‌లోని 443 నంబర్ గదిపై దాడి చేసింది. అక్కడ రెండు యువతులు, నలుగురు యువకులు కలిసి మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నట్టు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎవరు ఎవరంటే?
ఈ కేసులో పట్టుబడిన వారంతా 23-25 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. ఇద్దరు యువతులు కళారంగానికి చెందినవారు కాగా, మిగతా నలుగురు యువకులు వ్యాపార రంగానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వీరిలో మామ టార్గెట్ చేసిన యువతి కూడా ఉంది.

పోలీసులకు పక్కా సమాచారం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కోడలు – అల్లుడు మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి. దీనిని ఆసరాగా తీసుకుని మామ గుట్టుచప్పుడు కాకుండా ఆమెను ట్రాక్ చేసి, మందు పార్టీ ప్లాన్ చేసిన విషయం తెలుసుకుని సూరత్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు. అందులో నా కోడలు ఈ గదిలో మందు తాగుతోందని చెప్పడంతో, పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.

Also Read: Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

రక్తపరీక్షల్లో మద్యం తాగినట్లు నిరూపణ
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, హాఫ్ ఫుల్ మద్యం బాటిల్, నలుగు గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆరుగురిని అదుపులోకి తీసుకుని సివిల్ హాస్పిటల్‌కు తరలించి రక్త పరీక్షలు నిర్వహించారు. అందరి రక్తంలోనూ మద్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఈ ఘటన జరిగిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చేసిన ప్లాన్… కుటుంబ సమస్యల వల్ల పోలీస్ కేసుగా మారిపోయింది. ఒకవైపు పార్టీ, మరోవైపు కుటుంబ వివాదం.. రెండూ కలిసి ఆ యువతుల జీవితాల్లో పెను మలుపు తిప్పాయి.

మామ vs కోడలు
కోడలిపై పెరిగిన కోపం, ఆవేశంతో మామ చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆ కుటుంబమే కాకుండా స్నేహితులు, హోటల్ యాజమాన్యాన్ని కూడా ఇబ్బందుల్లో పడేసింది. గుజరాత్‌లో మద్యం నిషేధం ఉన్న నేపథ్యంలో, ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. నిషేధం ఉన్న రాష్ట్రంలో మద్యం తాగడమే కాకుండా, ఓ కుటుంబ కలహం వలన మొత్తం రట్టు అయింది.

పోలీసుల దృష్టికే కొత్త కోణం
ఇక పోలీసులు ఇప్పుడు మద్యం సరఫరా ఎలా జరిగిందో, హోటల్ యాజమాన్యం పాత్ర ఏంటో, ఇలాంటి ఇంకెన్ని పార్టీలు జరుగుతున్నాయో అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసును మరింత లోతుగా పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన ఒక వ్యక్తిగత సమస్యగా మొదలై, కుటుంబ సమస్యలు ఎలా ఉండాలో, వాటిని ఎలా పరిష్కరించాలో అన్నదానికి ఇది ఓ గుణపాఠం.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×