BigTV English

Watch Video: మెట్రోలో మద్యం తాగిన యువకుడు..నెట్టింట వీడియో వైరల్!

Watch Video: మెట్రోలో మద్యం తాగిన యువకుడు..నెట్టింట వీడియో వైరల్!

మెట్రో రైళ్లలో యువతీ యువకులు రీల్స్ చేయడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఫన్నీ వీడియోలు, అదిరిపోయే డ్యాన్స్ లు చేసిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి కూడా. మరీ శ్రుతి మించకుండా రీల్స్ చేసుకున్నా మెట్రో అధికారులు పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ప్రయాణం చేస్తున్న యువకుడు ఏకంగా మద్యం తాగడం సంచలనం కలిగించింది. మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.


బెడిసికొట్టిన తిక్క చేష్టలు!

ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగింది. కదులుతున్న మెట్రో రైలులో ఓ వ్యక్తి మద్యం తాగే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సదరు వ్యక్తి జంబో గ్లాస్ లో మద్యం పోసి తాగుతూ కనిపించాడు. ఉడికించిన గుడ్డును పగలగొట్టి తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెట్రోలో మద్యం తాగిన యువకుడిని వదలకూడదంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మెట్రోలో మద్యం తాగిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చివరకు అతడిని నార్త్ ఢిల్లీలోని బురారీ నివాసిగా గుర్తించారు. ఇంటికెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. “నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై DMRC చట్టంలోని 59 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశాం” అని పోలీసులు తెలిపారు. మెట్రోలో ఎవరు ఇలాంటి పనులు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిందితుడు ఏం చెప్పాడంటే?

ఈ ఘటనపై నిందితుడు స్పందించాడు. తాను మెట్రోలో తాగింది మద్యం కాదు, ఆపిల్ ఫిజ్ అని వివరించాడు. “వీడియోలో మద్యం తాగుతూ, గుడ్డు తిన్నట్లు కనిపించాను. అది మద్యం కాదు ఆపిల్ ఫిజ్” అని చెప్పాడు. అదే సమయంలో తాను తప్పు చేశానని, మరెవరూ అలాంటి పని చేయకూడదన్నాడు. “నేను తప్పు చేశాను. మరెవరూ ఇలాంటి పని చేయకూడదని కోరుతున్నాను. నేను చేసిన పనికి కేసు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను” అన్నాడు. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు తన ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

Read Also: ప్రయాణికుల ముందే మందుకొట్టిన పైలట్.. ప్రాణాలు గాల్లోకి!

పోలీసులు ఏం చెప్పాలరంటే?

“మెట్రోలో సదరు నిందితుడు తాగింది ఆపిల్ ఫిజ్ అయినప్పటికీ, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అలా చేసినప్పటికీ, మెట్రోలో మద్యం సేవించేలా ప్రోత్సాహిస్తున్నట్లు ఉంది. అందుకే, అతడిపై చర్య ప్రకారం చర్యలు తీసుకోబోతున్నాం” అని పోలీసులు తెలిపారు.

Read Also: పులిని భయపెట్టిన చేప.. ఏం కిక్కుంది మామా!

Related News

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Big Stories

×