దేశంలో చాలా మంది వాళ్ల కోసం వాళ్లు కాకుండా.. ఎదుటి వాళ్లు ఏం అనుకుంటారో అనే ఆలోచనతో బతుకుతారు. నాకు నచ్చినట్లు నేనుంటాను అనే ఆర్జీవీ లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. చేసే పని ఏదైనా కానివ్వండి. ఎంత బాగా చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఫైవ్ స్టార్ హోటల్ ముందు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలంటే భయపడతారు. అంత పెద్ద హోటల్ ఉండగా జనాలు తమ దగ్గరికి ఏం వస్తారు? అని ఆలోచిస్తారు. కానీ, ఓ యువకుడు ఇలా ఆలోచించలేదు. హైదరాబాద్ లోనే ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్ ముందు చిన్న చాయ్ బండి పెట్టాడు. సక్సెస్ ఫుల్ గా తన బిజినెస్ కొనసాగిస్తున్నాడు. నిత్యం కస్టమర్లతో తన బిజినెస్ సక్సెస్ ఫుల్ ఆ కొనసాగిస్తున్నాడు.
హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ ముందు చిన్న చాయ్ బండి
రీసెంట్ గా హైటెక్ సిటీ సమీపంలో నీలోఫర్ కేఫ్ ఓపెన్ అయ్యింది. టెక్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులతో పాటు పలువురు క్లాస్ పీపుల్ అందులో చాయ్ తాగేందుకు క్యూ కడుతున్నారు. ఇందులో చక్కటి బేకరీ ఫుడ్స్ కూడా అందులో లభిస్తున్నాయి. ఈ కేఫ్ ముందు ఓ యువకుడు చాయ్ బండి పెట్టాడు. చాయ్ తో పాటు బిస్కెట్లు, సిగరెట్లు అమ్ముతున్నాడు. కేఫ్ లోకి వెళ్లే స్తోమత లేని వాళ్లంతా ఈ యువకుడి బండి దగ్గరికే వస్తున్నారు. ఆయన బిజినెస్ చక్కగా రన్ అవుతోంది. తాజా ఓ కస్టమర్ ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Read Also: బాలిలో ఇన్ ఫ్లుయెన్సర్ హనీమూన్ వెకేషన్.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?
యువకుడిపై నెటిజన్ల ప్రశంసలు
హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ లో చాయ్ తాగాలంటే చాలా ఖర్చు అవుతుందని, సాధారణ ఉద్యోగులు అందులో చాయ్ తాగలేరని నెటిజన్లు చెప్తున్నారు. అందుకే, ఈ చాయ్ బండికి మంచి గిరాకీ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. “ఉన్నోడికి ఉన్నోడు దోస్త్, లేనోడికి లేనోడో దోస్త్” అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “నీలోఫర్ లో ఒక్కో చాయ్ ధర రూ. 200 ఉంటుందని, అదే డబ్బుతో ఇక్కడ 20 మందికి చాయ్ తాగించే అవకాశం ఉందంటున్నారు. “నీలోఫర్ టీ కంటే ఇలాంటి బండి మీద చాయ్ బాగుంటుంది” అని ఇంకొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఈ గుండె బతకాలి” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “అందరూ నీలోఫర్ కేఫ్ లో తాగేవాళ్లు ఉండరు. అలాంటి వారికి ఇదో అడ్డా” అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “నీలోఫర్ కు వచ్చిన వాళ్లు కూడా ఇక్కడికే వచ్చి టీ తాగి వెళ్లేలా ఉన్నారు” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ యువకుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు.
Read Also: అతిగారాబంతో మొదటికే మోసం, పిల్లల విషయంలో తల్లిందండ్రుల తీరుపై సజ్జనార్ సీరియస్!