Lucknow News: లక్ష మార్క్‌ని బంగారం తాకడంతో సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఫలితంగా మహిళల చూపు పుత్తడిపై పడింది. అయితే పైన కనిపిస్తున్న కిలాడీ మహిళకు చెవి రింగులు తెగ నచ్చేశాయి. కాకపోతే డబ్బులు లేకపోవడంతో తన టాలెంట్ ఉపయోగించింది. సైలెంట్‌గా కొట్టేసి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో లక్నో సిటీలో వెలుగు చూసింది.
బంగారానికి ధర పెరగడంతో షాపుల ఓనర్లు నిత్యం సీసీ కెమెరాలపై ఓ కన్నేశారు. కస్టమర్లు ఎవరో, దొంగతనానికి వచ్చినవారు ఎవరో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సరే బంగారం షాపుల్లో చోరీలు జరుగుతున్నాయి. పైన కనిపిస్తున్న మహిళ టిప్ టాప్‌గా తయారై లక్నోలోని భూత్‌నాథ్ మార్కెట్‌లో ఉన్న రిద్ధి జ్యువెలర్స్ షాపుకి వెళ్లింది. ఆమె కిలాడీ లేడి అని షాపులో వారికి తెలీదు.
కస్టమర్ల మాదిరిగా ఆ మహిళకు మర్యాదలు చేశారు. వెళ్లగానే షాపులో చెవి రింగులు మహిళకు భలే నచ్చాయి. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలని భావించింది. అమ్మకం దారుడు ఎదురుగా ఉండగానే క్షణాల్లో తన నైపుణ్యాన్ని ఉపయోగించి చెవి రింగులను మాయం చేసింది. అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకుంది. కొట్టేసిన చెవి పోగులు దాదాపు 1 గ్రాము ఉంటాయని చెబుతున్నాడు షాపు ఉద్యోగి.
పట్ట పగలు షాపు సిబ్బంది ముందు వాటిని దొంగిలించి పారిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. చెవి పోగులను దొంగిలించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ మహిళ బయటకు వెళ్లినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మాత్రం ఆలోచించకుండా షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఈ విధంగా, అసలు మేటరేంటి?
సీసీటీవీ ఫుటేజ్‌పరిశీలించిన పోలీసులు, నిందితురాలు గమనించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె కోసం వెతుకుతున్నారు. బంగారం ధరలు అమాంతంగా పెరిగిన వేళ షాపు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక్కడే కాదు కొద్దిరోజుల కిందట డెహ్రాడూన్‌లోని పల్టాన్ బజార్‌లో నగల దుకాణం నుండి బంగారు ఉంగరాలను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది ఓ మహిళ. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత బంగారు ఉంగరాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో వారిపై ఘర్షణకు దిగింది. చివరకు దొంగ పోలీసులకు లొంగిపోవడంతో షాపు ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు.
लखनऊ के गाजीपुर थाना क्षेत्र की भूतनाथ मार्केट में रिद्धि-सिद्धि सर्राफ ज्वेलर्स की दुकान पर एक महिला ने चोरी की वारदात को अंजाम दिया। महिला ने सोने की बालियों पर हाथ साफ कर मौके से फरार हो गई। भूतनाथ चौकी से महज 500 मीटर की दूरी पर महिला ने दुकान पर दिया वारदात। इस घटना की पूरी… pic.twitter.com/xQPR7jby7z
— Roshan Kumar Journalist (@cameraman_r) August 8, 2025