BigTV English

Viral News: స్కూటీ కాస్ట్ లక్ష, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కాస్ట్ 14 లక్షలు!

Viral News: స్కూటీ కాస్ట్ లక్ష, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కాస్ట్ 14 లక్షలు!

చాలా మంది వాహనదారులకు ఫ్యాన్సి నెంబర్ పిచ్చి ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత మంది లక్షల రూపాయలు ఖర్చు చేయడం చూస్తూనే ఉంటాం. వాహనానికి అయిన ధరతో పోల్చితే రెండు మూడు రెట్లు ఎక్కువ ధర పెట్టి నెంబర్ ప్లేట్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం పెట్టిన ఖర్చు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఏ వాహనం కొనుగోలు చేశాడు? ఆయన నెంబర్ ప్లేట్ ఖరీదు ఎంత అయ్యింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


స్కూటీ ఖరీదు రూ. 1 లక్ష, నెంబర్ ప్లేట్ కాస్ట్ రూ. 14 లక్షలు

తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి హోండా యాక్టివా కొనుగోలు చేశాడు. ఈ టూ వీలర్ కోసం ఆయన రూ. 1 లక్ష ఖర్చు చేశాడు. ఎలాగైనా తన వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ పెట్టించుకోవాలి అనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ. 14 లక్షలు ఖర్చు చేశాడు. ఆర్టీఏ అధికారులు ఆయనకు VIP రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించారు. HP21C-0001 అనే నెంబర్ ను ఆయనకు అందించారు. హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ నిర్వహించిన ఆన్‌ లైన్ వేలంలో ఆయన అందరికంటే ఎక్కువ బిడ్ వేసి ఈ నెంబర్ ప్లేట్ ను దక్కించుకున్నాడు.


ఈ నెంబర్ ప్లేట్ కోసం పోటీ పడ్డ ఇద్దరు వాహనదారులు

HP21C-0001 నెంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో కేవలం ఇద్దరు బిడ్డర్లు పాల్గొన్నారు. రెండో వ్యక్తి రూ. 13.5 లక్షలు బిడ్ వేయగా, సంజీవ్ కుమార్ రూ. 14 లక్షలకు బిడ్ వేశాడు. వీఐపీ నెంబర్ ప్లేట్ ను దక్కించుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఓ టూవీలర్ నెంబర్ ప్లేట్ కు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బిడ్ మొత్తాన్నిరాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నెంబర్ ను ఆర్టీఏ అధికారులు ఆయనకు అందజేస్తారు.

నెంబర్ ప్లేట్ డబ్బులతో లగ్జరీ కారు వచ్చుకదా!

ఇక ఈ నెంబర్ ప్లేట్ బిడ్ గురించి నెటిజన్లు షాకవుతున్నారు. “ఈ నెంబర్ ప్లేట్ కు పెట్టిన డబ్బులతో ఏకంగా లగ్జరీ కారు కొనవచ్చు కదా?” అంటున్నారు. “ యాక్టివా నంబర్ ప్లేట్ కు రూ. 14 లక్షలు ఖర్చు చేయడం నిజంగా పిచ్చి అనవచ్చు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

ఫ్యాన్సీ నెంబర్లకు బాగా క్రేజ్!

దేశంలో VIP, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం చాలా మంది పోటీ పడుతుంటారు. చాలా మంది వాహన యజమానులు ‘0001’, ‘9999’, ‘0007’ వంటి ప్రత్యేక కాంబినేషన్‌లను పొందడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఈ నెంబర్స్ తమకు అదృష్టాన్ని కలిగిస్తాయని నమ్ముతారు.

Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×