BigTV English

Viral News: ఇదేందయ్యా ఇది..! భర్తపై కోపంతో పెన్నులు మింగిన భార్య

Viral News: ఇదేందయ్యా ఇది..! భర్తపై కోపంతో పెన్నులు మింగిన భార్య

Viral News: భర్తపై కోపం వస్తే ఏం చేస్తారు? అయితే అరుస్తారు.. లేదంటే ఏడుస్తారు.. ఇంకా ఎక్కువగా కోపంగా ఉంటే అలుగుతారు. కానీ ఓ భార్య మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేసింది. ఏకంగా పెన్నులు మింగేసింది. వినడానికి కాస్త సిల్లీగా, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెన్నులు మింగేసింది.


వాంతులతో హాస్పిటల్ చేరిన మహిళ
నరసరావుపేటకు చెందిన ఆ యువతి వాంతులు అవుతున్నాయంటూ.. తీవ్ర అస్వస్థతతో స్థానిక ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు ఆవిడను పరిశీలించగా.. సాధారణ లక్షణాలుగా ఏమీ కనిపించలేదు. కడుపు నొప్పి, వాంతులు, అలసట వంటి లాక్షణాలు ఉన్నప్పటికీ అసలు సమస్య ఏంటో తెలియక, స్కాన్‌ చేయించారు వైద్యులు. అప్పుడు ఆమె కడుపులో ఏకంగా నాలుగు పెన్నులు ఉన్నట్లు బయటపడింది.

డాక్టర్లు కూడా షాక్
సాధారణంగా చిన్న పిల్లలు తెలియక చిన్నచిన్న వస్తువులు నోట్లో వేసుకుని మింగేస్తూ ఉంటారు. కానీ ఈ వయసులో ఓ మహిళ చాదస్తంతో.. ఇలా పెన్నులు మింగడంతో వైద్యులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమెను విచారించగా భర్తపై కోపంతో పెన్నులు మింగానని చెప్పిందట. దీనిని విన్న వైద్య బృందం ఒక్కసారిగా అవాక్కయింది. భావోద్వేగాలను ఇలా శారీరకంగా బాధించుకునే స్థాయికి చేరిందంటే.. అది మానసిక స్థితి ఎంత తీవ్రమైందో చెప్పకనే చెప్పింది.


అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ సర్జరీతో రిస్క్ లేకుండా శస్త్రచికిత్స
సర్జరీకు డాక్టర్ రామచంద్రారెడ్డి నాయకత్వంలో.. వైద్య బృందం రంగంలోకి దిగింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీయాలి. అయితే అధునాతన లాప్రోస్కోపిక్ టెక్నాలజీని వినియోగించి సర్జరీ చేసి ఆ నాలుగు పెన్నులను.. ఎలాంటి కోతలు లేకుండా బయటకు తీశారు.

వైద్యుల హెచ్చరిక
వైద్యులు మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కోపాన్ని, బాధను ఇలా శరీరంపై పడేలా చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం ద్వారా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. పెన్నుల మాదిరిగా పదునైన వస్తువులు మింగితే ఆహార నాళం, కడుపు, అంతరాయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చు.

మొత్తానికి..
ఈ ఘటన రెండు విషయాలను బహిర్గతం చేసింది.

కోపం మనుషులను ఎంతకైనా తెగించేసేలా చేస్తుందని.

ఆధునిక వైద్య విధానాలతో ఎలాంటి కోతలు లేకుండానే.. శస్త్రచికిత్సలు చేయవచ్చని.

Also Read: తెలివి ఉండే నా తల రాత రాశావా? దేవుడికి లెటర్ రాసి.. యువకుడు అలాంటి పని..

భావోద్వేగాలను అణచివేయడం, వాటిని సమర్థవంతంగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. ఒక చిన్న కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం.. పశ్చాత్తాపానికి గురిచేసే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆలోచన చేసి, శాంతంగా వ్యవహరించండి. జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

 

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×