BigTV English

Viral Video: లేడీస్ హాస్టల్‌లో అనకొండ.. 17 అడుగుల పొడవు, 100 కిలోల బరువు, వీడియో వైరల్!

Viral Video: లేడీస్ హాస్టల్‌లో అనకొండ.. 17 అడుగుల పొడవు, 100 కిలోల బరువు, వీడియో వైరల్!

తరచుగా మనకు పాములు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తేనే భయంతో వణుకుతాం. అలాంటిది, తాజాగా అసోంలో ఏకంగా 100 కిలోల బరువున్న భారీ అనకొండ కనిపించింది. సిల్చార్ లోని అసోం యూనివర్సిటీ బాలికల హాస్టల్ సమీపంలో ఈ కొండచిలువ దర్శనం ఇచ్చింది. ఈ అనకొండను చూసి విద్యార్థులు భయంతో వణికిపోయారు. అటవీ అధికారులకు సమాచారం అందివ్వడంతో.. జవాన్ల సాయంతో ఆ కొండ చిలువను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు.


యూనివర్సిటీ ప్రాంగణంలోకి భారీ పాములు

అసోం యూనివర్సిటీ పరిసరాల్లో గత కొంతకాలంగా పెద్ద అనకొండ చిలువలు, కింగ్ కోబ్రాలు దర్శనం ఇస్తున్నాయి. విద్యార్థులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తాజాగా సిల్చార్ క్యాంపస్‌ లోని గర్ల్స్ హాస్టల్ నంబర్ 1 సమీపంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. రాత్రి 10.30 గంటల ప్రాంతలో విద్యార్థులు అక్కడికి వెళ్లి చూశారు. ఒక్కసారిగా పెద్ద కొండ చిలువ కనిపించడంతో భయంతో వణికిపోయారు. ఈ విషయాన్ని వెంటనే యూనివర్సిటీ అధికారులకు చెప్పారు. వాళ్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు అక్కడి వచ్చి భారీ అనకొండను పట్టుకున్నారు. దీంతో వర్సిటీ విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పాము సుమారు 17 అడుగుల పొడవు, 100 కిలోల బరువు ఉన్నది. దీనిని బర్మీస్ పైథాన్ గా అధికారులు గుర్తించారు. జవాన్ల సాయంతో దాన్ని అక్కడి నుంచి తరలించారు.  ప్రస్తుతం ఈ పామును పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోది.


ఇప్పటి వరకు గుర్తించిన అత్యంత బరువైన కొండ చిలువ

బరాక్ లోయ ప్రాంతంలో గుర్తించి అత్యంత బరువైన పాము ఇదేనని ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన వన్యప్రాణి పరిశోధకుడు బిషల్ సోనార్ వెల్లడించారు. ఈ కొండ చివలతో మనుషులకు ఎలాంటి ముప్పు కలగదన్నారు. ఒకవేళ ఇలాంటి పైథాన్ ను చూస్తే దానికి ఎలాంటి హాని చేయకూడదన్నారు. బర్మీస్ కొండ చిలువలు మేకలు, ఇతర చిన్న జంతువులను వేటాడుతాయని చెప్పారు.

రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న 13 మంది

ఈ కొండ చిలువ భారీగా బరువు ఉండటంతో దాన్ని బంధించి, అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 13 మంది అటవీ అధికారులో పాటు జవాన్లు పాల్గొన్నారు.  ఈ కొండ చిలువను రక్షించి బరైల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ నిర్దేశిత ఇన్నర్ లైన్ వుడ్ ల్యాండ్ ఏరియాలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also: 4 గంటల్లో 15 లీటర్ల మద్యం ఖాళీ, మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా అయ్యా!

భయాందోళనలో వర్సిటీ విద్యార్థులు

వాస్తవానికి గత కొద్ది కాలంగా యూనివర్సిటీ క్యాంపస్ లో పెద్ద పాములు సంచరిస్తున్నాయి. కొండ చిలువలతో పాటు కింగ్ కోబ్రాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్యాంపస్ లోకి పాములు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ వస్తూనే ఉన్నాయి. తాజాగా పెద్ద అనకొండ కనిపించడంతో విద్యార్థులు తీవ్రంగా భయపడుతున్నారు. ఇకపై క్యాంపస్, హాస్టళ్ల సమీపంలోకి పాములు రాకుండా చూడాలని వర్సిటీ అధికారులను కోరుతున్నారు.

Read Also: మహిళకు నిప్పు.. మంటల్లో కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేసిన కిరాతకుడు!

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×