Viral Video : వాళ్లంతా ఒకే ఫ్యామిలీ. మొత్తం 17 మంది. సరదాగా నదీ తీరానికి ట్రిప్‌కు వెళ్లారు. పక్కన నదీ ప్రవాహం. చుట్టూ ఇసుక. మధ్యలో ఓ ఎత్తు దిబ్బ. ఒకే ఒక చెట్టు. ఆ సీన్ చూట్టానికి సూపర్ ఉంది. ఎంచక్కా అక్కడ కూర్చున్నారు వాళ్లంతా. సెల్ఫీలు దిగారు. ఇసుకలో ఆడుకున్నారు. నదిలో గంతులేశారు. ప్రకృతిని ఎంజాయ్ చేశారు. ఆ చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న టిఫిన్ తిన్నారు. సాయంత్రం వరకూ అక్కడే ఉండాలని అనుకున్నారు. అలా వారంతా జాలీగా, హ్యాపీగా ఉన్నారు. ఆనందంలో మునిగి పోయారు. అంతలోనే….
నదీ ప్రవాహం ఉక్కసారిగా పెరిగడం స్టార్ట్ అయింది. ఆ కుటుంబం అదేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. వాళ్ల మానాన వాళ్లు చెట్టుకింద ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నిమిషాల గ్యాప్‌లోనే వాళ్లున్న ఇసుక దిబ్బ చుట్టూ వరద ముంచెత్తింది. అప్పటి వరకు ఉన్న ఇసుక కనిపించకుండా పోయింది. మొత్తం నీటితో నిండిపోయింది. చుట్టూ నది.. మధ్యలో ఆ ఫ్యామిలీ. ఓ చెట్టు. అంతే. కనుచూపు మేర అంతా వరదే.
చూస్తుండగానే ఒక్కసారిగా దారుణంగా తయారైంది వారి పరిస్థితి. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో చిక్కుకుపోయారు. భయంతో అరుస్తున్నారు. వాళ్ల పిలుపు ఎవరికీ వినిపించట్లేదు. దూరంలో కొందరు సందర్శకులు ఉన్నా వీళ్లను కాపాడే పరిస్థితి లేదు. చుట్టూ రాకాసి వరద. మధ్యలో మనుషులు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా బయటపడాలో తెలీట్లేదు. గంటలు గడుస్తున్నా తప్పించుకునే మార్గం దొరకలేదు. వరద తీవ్రతకు కాళ్ల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోతోంది. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. అయినా, పట్టు తప్పింది. 9మంది నదిలో కొట్టుకుపోయి చనిపోయారు. మిగతా వారు గల్లంతయ్యారు. ఆర్మీ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు.
ఇదంతా పాకిస్తాన్‌లోని స్వాత్ రివర్‌లో జరిగింది. సియాల్‌కోట్ నుంచి వచ్చిన ఫ్యామిలీ అలా నదిలో గల్లంతైంది. ఘటనపై పాక్ ప్రధాని స్పందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నదీ తీరాలకు వెళ్లొద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Flash Flood Tragedy in #Pakistan’s #SwatRiver
A devastating flash flood struck the Swat River in Pakistan on Thursday, sweeping away a group of people, including women and children.
According to local authorities, at least four people have been confirmed dead, while 11 others… pic.twitter.com/6nFpwoBRN6
— BNN Channel (@Bavazir_network) June 27, 2025