OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. నచ్చిన సినిమాలను దొరికిన సమయంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటిలో హాలీవుడ్ సినిమాలకి ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా మొదట సరదాగా నడుస్తూ, తరువాత ఒక థ్రిల్లర్ గా మారిపోతుంది. ఒక అఫైర్ కారణంగా స్టోరీ అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో
ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది బాయ్ నెక్స్ట్ డోర్’ (The Boy Next Door). 2015 లో విడుదలైన ఈ సినిమాకి రాబ్ కోహెన్ దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నిఫర్ లోపెజ్, ర్యాన్ గుజ్మాన్, జాన్ కార్బెట్, ఇయాన్ నెల్సన్, క్రిస్టిన్ చెనోవెత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
క్లైర్ ఒక హైస్కూల్ ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమె భర్త గారెట్ తన సెక్రటరీతో సంబంధం పెట్టుకున్న కారణంగా, క్లైర్ అతనితో విడిపోతుంది. ప్రస్తుతం తన టీనేజ్ కొడుకు కెవిన్ తో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. క్లైర్ తన వివాహంలోని సమస్యలతో సతమతమవుతూ, విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె పని చేసే స్కూల్ వైస్ ప్రిన్సిపల్ విక్కీ లాన్సింగ్ ఆమెను విడాకులు తీసుకోమని ప్రోత్సహిస్తుంది.ఈ సమయంలో19 ఏళ్ల నోవా శాండ్‌బోర్న్, అనారోగ్యంతో ఉన్న తనమామ ఇంట్లోకి వస్తాడు. ఈ ఇళ్ళు నోవాకు పొరుగున ఉంటుంది. నోవాకు క్లైర్ ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అంతేకాకుండా క్లైర్ కొడుకు కెవిన్‌తో త్వరగా స్నేహం చేస్తాడు. నోవా అతనిపై ఇష్టం పెంచుకుంటుంది. ఒక రోజు కెవిన్ గారెట్ ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్తాడు. ఇక క్లైర్ తన స్నేహితురాలు విక్కీతో ఒక డబుల్ డేట్‌కు వెళుతుంది. కానీ ఆ డేట్ క్యాన్సిల్ అవుతుంది.
ఇక క్లైర్ ఒంటరితనం ప్రభావంతో నోవా ఇంటికి వెళుతుంది. ఆరోజు ఇద్దరూ కలసి ఏకాంతంగా గడుపుతారు. మరుసటి రోజు క్లైర్ తన తప్పును గ్రహించి, నోవాతో సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటుంది. కానీ నోవా ఆమెపై విపరీతమైన మొహాన్ని పెంచుకుంటాడు. నోవా ప్రవర్తన క్రమంగా భయంకరంగా మారుతుంది. అతను క్లైర్‌ను స్టాక్ చేయడం ప్రారంభిస్తాడు. వీళ్ళిద్దరూ గడిపిన వీడియొ లను వైరల్ చేస్తాడు. నోవా గతంలో అతను మరో స్కూల్ నుండి సైకో ప్రవర్తన కారణంగా బయటికి పంపారని తెలుస్తుంది. క్లైర్ అతనిని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ నోవా ఆమెను బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఈ స్టోరీ ఒక హింసాత్మక క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. చివరికి క్లైర్, నోవాను ఎలా ఎదుర్కుంటుంది ? నోవా ఆమెను దక్కించుకోవడానికి ఎలాంటి హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు ? క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : బ్రతికుండగానే నాటుకోడిని నమిలి మింగేసే పిల్ల పిశాచి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ స్టోరీ