BigTV English

IND VS NZ: CT ఫైనల్ టై అయితే విజేత ఎవరు..? సూపర్ ఓవర్ ఆడాల్సిందేనా..?

IND VS NZ: CT ఫైనల్ టై అయితే విజేత ఎవరు..? సూపర్ ఓవర్ ఆడాల్సిందేనా..?

IND VS NZ:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. హైబ్రిడ్ మోడల్ లో ఈ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో… దుబాయ్ వేదిక అయింది. హైబ్రిడ్ మోడల్ కాకపోయి ఉంటే పాకిస్తాన్ లో ఈ మ్యాచ్ జరిగేది. టీమిండియా పట్టుబట్టి మరి హైబ్రిడ్ మోడల్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఒప్పించింది.


Also Read: ICC CT 2025 – IPL 2025: ఫైనల్స్ కెప్టెన్లు ఇద్దరు… హార్దిక్ పాండ్యా కింద ఆడాల్సిందే ?

మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా ఎలా చూడాలి ?


టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగే ఆదివారం ఫైనల్ మ్యాచ్… జియో హాట్ స్టార్ లో మనం ఉచితంగా చూడవచ్చు. జియో కస్టమర్ లందరికీ… ఈ ఫెసిలిటీ కల్పించింది రిలయన్స్. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లన్ని ఉచితంగానే జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా… మ్యాచ్ లు తిలకించవచ్చు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… జరిగే ఫైనల్ మ్యాచ్… భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది.

ఫైనల్ మ్యాచ్ టై అయితే ఎలా?

 

ఆదివారం రోజున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు వర్షం ముప్పు లేదని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే ఈరోజట్లు కనీసం 25 ఓవర్ల పాటు ఆడితే పరిస్థితి… భిన్నంగా మారుతుంది. అప్పుడు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఆరోజు మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్ డే కూడా ఉంటుంది. ఇక రిజర్వుడే రోజు కూడా వర్షం భారీగా కొడితే పరిస్థితి మరోలా ఉంటుంది. అప్పుడు ఇరుజట్లను.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతలుగా ప్రకటిస్తారు. అలాకాకుండా… మ్యాచ్ టై అయితే… సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్ ఆడాల్సిందే.

Also Read:  BCCI – Virat Rohit: గ్రేడ్ A+ గ్రేడ్ కాంట్రాక్టులు కోల్పోనున్న రోహిత్, విరాట్, జడ్డూ?

ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు.. చెబుతున్నారు. చేజింగ్ చేసే జట్టుకు…. పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోతాయని అంటున్నారు. రెండవ ఇన్నింగ్స్ లో స్పిన్ బౌలర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు దాదాపు గెలిచినట్టే. అయితే ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో టాస్ గెలవలేదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ అంశం టీమిండియా ఫ్యాన్స్ ను వనికిస్తోంది.

 

 

 

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×