Income Tax Free State: ప్రజలంతా సక్రమంగా ట్యాక్స్ చెల్లించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ప్రతి ఏటా సక్రమంగా ట్యాక్స్ పే చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. సక్రమంగా ట్యాక్స్ పే చేసే వారికి మినహాయింపులు కూడా అందిస్తాయి ఆయా ప్రభుత్వాలు. అయితే, దేశంలో ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేని రాష్ట్రం ఒకటి ఉంది. ఇక్కడి ప్రజలు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించరు. దశాబ్దాలుగా ఈ మినహాయింపు అనేది కొనసాగుతోంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది? ఎందుకు అక్కడి ప్రజలు ట్యాక్స్ చెల్లించరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయని ఏకైక రాష్ట్రం సిక్కిం
దేశంలో ఆదాయ పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం సిక్కిం. దేశంలోని ఈ రాష్ట్ర పౌరులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీ అందిస్తోంది. దానికి ఓ కారణం ఉంది. 1975 నుంచి ట్యాక్స్ సిక్కింకు మిహాయింపు అనేది అమల్లోకి వచ్చింది. ఆ ఏడాదిలోనే సిక్కిం అధికారికంగా భారత్ లో విలీనం అయ్యింది. అక్కడి ప్రజలు సాంస్కృతిక, ఆర్థిక హక్కులను కాపాడేందుకు భారత ప్రభుత్వం వారికి ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. మాటలకే పరిమితం కాకుండా ఆదాయపన్ను చట్టాన్ని కూడా మార్పు చేసింది. ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 10(26AAA) కింద సిక్కింకు ట్యాక్స్ మినహాయింపు చట్టబద్దం చేసింది.
Read Also: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..
ట్యాక్స్ మినహాయింపు అందరికీ వర్తించదా?
సిక్కిం రాష్ట్రానికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తించదు. కేవలం సిక్కిం సబ్జెక్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే, అసలైన సిక్కిం వాస్తవ్యులు అని తెలిపే సర్టిఫికేట్ కలిగిన వాళ్లకు మాత్రమే ఈ మనహాయింపు ఉంటుంది. లేదంటే, 1961లో ఓటర్ లిస్టులో పేరు కలిగిన వాళ్లకు కూడా ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఉంటుంది. వేరే ప్రాంతం నుంచి వచ్చి సిక్కిం ప్రాంతంలో స్థిరపడిన వారికి ఈ మినహాయింపు ఉండదు. అంతేకాదు, సిక్కిం రాష్ట్రంలో ఉంటూ, అక్కడి నుంచి కాకుండా బయట నుంచి ఆదాయం పొందేవారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. సిక్కింలో ఉంటూ, సిక్కిం నుంచి ఆదాయం పొందే వారికి ఈ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. దేశంలోని మరే ఇతర ప్రాంత ప్రజలకు ట్యాక్స్ మినహాయింపు అనేది ఉండదు. Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!