BIG TV LIVE Originals: భూ గ్రహం మనుగడకు మూలాధారం సూర్యుడు. భూమ్మీద జీవరాశులు బతుకుతున్నాయంటే దానికి కారణం సూర్యుడు. సూర్యరశ్మి కారణంగానే మొక్కలు మనకు కావాల్సిన ప్రాణవాయువును, ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. భూమి సక్రమంగా కక్ష్యలో తిరగడానికి కారణం సూర్యుడే. ఒకవేళ సూర్యుడు అకస్మాత్తుగా మాయం అయితే ఏం జరుగుతుంది? భూమ్మీద జీవరాశులు ఏమవుతాయి? భూగ్రహం మనుగడ కొనసాగుతుందా? అనే విషయాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సూర్యుడు మాయం అయితే ఎదురయ్యే పరిస్థితులు
సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యమైతే భూమి మీద పెద్ద మార్పులు ఏర్పడుతాయి. భూమి నెమ్మదిగా చల్లబడి పోతుంది. జీవరాశుల అంతం మొదలవుతోంది. కొన్ని రోజుల్లోనే ఉష్ణోగ్రతలు తగ్గి ప్రాణకోటి మరణం ప్రారంభం అవుతుంది. సముద్రాలు గడ్డ కట్టిపోవడంతో పాటు భూ గ్రహం గతితప్పుతుంది.
⦿ అంతా చీకటి మయం
సూర్యుడి నుంచి భూమికి సూర్య కిరణాలు ప్రసరించడానికి సుమారు 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుడు మాయం అయిన వెంటనే కాకుండా, 8 నిమిషాల తర్వాత కాంతి తగ్గిపోతుంది. ఒక్కసారిగా చీకట్లు అలుముకుంటాయి. భూమి అంతా చీకటి మయంగా మారిపోతుంది.
⦿ ఉష్ణోగ్రతలో మార్పులు
సూర్యుడి వెలుతురు లేకపోతే భూమి వేడిని కోల్పోతుంది. నెమ్మదిగా భూమి చల్లబడటం మాయం అవుతుంది. కొద్ది రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు -100°C దాకా వెళ్తాయి.
⦿ సముద్రాలు గడ్డ కట్టడం
సూర్యుడి వేడి లేకపోవడం వల్ల చలి తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా సముద్రాలు గడ్డకట్టడం ప్రారంభం అవుతుంది. కొన్ని నెలల్లోనే సముద్రాలు అన్ని గడ్డ కట్టడం మొదలవుతాయి. నెమ్మది నీళ్లన్నీ మంచు గడ్డలా మారిపోతాయి. సముద్రంలోని జీవరాశులు అంతం అవుతాయి.
⦿ చెట్లు అంతరించిపోతాయి
సూర్యకాంతి లేకపోవడం వల్ల మొక్కలలో కిరణ జన్య సంయోగక్రియ ఆగిపోతుంది. మొక్కలు ఫోటో సింథసిస్ చేయలేవు. ఫలితంగా ఆక్సీజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. జీవులకు ఆహారం అందకుండా పోతోంది.
⦿ జీవరాశులు అంతం
సూర్యుడు లేకపోవడం వల్ల పర్యావరణం వేగంగా మారుతుంది. చాలా రకాల జీవులు వేడి లేకపోవడం, చీకటి లేకపోవడం వల్ల మరణిస్తాయి. ఆహారం దొరక్క ఇతర జీవరాశులతో పాటు మానవులు కూడా ప్రాణాలు కోల్పోతారు.
⦿ కక్ష్య తప్పనున్న భూమి
సూర్యుడు లేకపోతే భూమి గురుత్వాకర్షణ శక్తి కోల్పోతుంది. ఫలితంగా సూర్యుడి చుట్టూ తిరగడం ఆగిపోతుంది. తన కక్ష్య నుంచి బయటకు వస్తుంది. అంతరిక్షంలో గతి తప్పి ప్రయాణిస్తుంది. ఫలితంగా ఇతర గ్రహాలను ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే.. సూర్యుడు మాయం అయిన తర్వాత కొన్ని వారాలు మాత్రమే భూమి మనుగడ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మంచుగడ్డలా మారిపోయి తన ఉనికి కోల్పోతుంది. భూమి శాశ్వతంగా కనుమరుగు అవుతుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: దేశంలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్, ఖోనోమా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!