Viral Video: ఆర్టీసీ బస్సులో కళ్లు తీసుకెళ్లొచ్చా.. ఇప్పుడు ఈ అంశాన్ని చర్చకు పెట్టిందో మహిళ. కల్లు బాటిళ్లతో బస్సెక్కిన ఓ మహిళను గుర్తించిన కండెక్టర్ నో పర్మిషన్ అనేసింది.
నల్గొండ జిల్లా కట్టెంగుర్ర సమీపంలో ఆ మహిళను బస్సులో నుంచి దించేశారు. దీంతో సదురు మహిళ ఆగ్రహంతో కట్టలు తెంచుకుంది. ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగింది. బస్సులో కల్లు తీసుకెళ్లద్దొనే రూల్ ఎక్కడుందంటూ నిలదీసింది. నడిరోడ్డుపై బస్సులో నుంచి దింపితే ఎలా అంటూ ఆవేదన వెల్లగక్కింది.
ఆర్టీసీ బస్సులో ఇటీవల కాలంలో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం.. అవకాశం కల్పించడంతో చాలా చోట్ల ప్రయాణికులు పరస్పర దాడులకు పాల్పడుతుంటే.. మరికొన్ని చోట్ల సిబ్బందితో ప్రయాణికులు గొడవలకు దిగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఫ్రీ బస్సులతో ఆడోళ్లకు కష్టాలు డబుల్, త్రిబుల్ అయ్యాయి. బస్సెక్కే ఆడోళ్లకు కనీసం విలువ కూడా ఇవ్వట్లేదు. బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు ఆడోళ్లను పురుగును చూసినట్లు చూస్తున్నారు.
ఇక తాజాగా నల్గొండకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ.. తనతో పాటు కల్లు తీసుకుని బస్సెక్కింది. ఇది గమనించిన డ్రైవర్ బస్సులోకి కల్లు తీసుకురాకూడదు.. నిబంధనలు ఉన్నాయని అడ్డు చెప్పారు. దీంతో ఆ మహిళ ఏకంగా ఆ బస్సుకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపింది. “ఇది మా ఊరిలో చేసే సాంప్రదాయం. పుట్టిన రోజు సందర్బంగా కల్లు తీసుకెళ్తున్నాను. నువ్వెవ్వరా నన్ను ఆపేది?” అంటూ ఆవేశంగా బస్సు దిగిపోయింది. కానీ అక్కడితో ఆగలేదు.. బస్సు ముందే నిలబడి నిలిపేసింది.
సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమెతో మాట్లాడారు. వాళ్ల మాటలు వినగానే విజయలక్ష్మి కొంచెం కూలడిపోయింది. మాఫ్ చేయండి బాబు, అనవసరంగా పెద్దవాళ్లను, బస్సులో వాళ్లను ఇబ్బంది పెట్టాను అంటూ వెనక్కి తగ్గింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బస్సులో కల్లు తీసుకురాకూడదనే రూల్ ఏమైనా ఉందా..? కల్లును బస్సులో తీసుకుపోవడాన్ని నిషేదించారా? మన రాష్ట్రంలో దానిని బ్యాన్ చేశారా..? ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు అయితే ఆర్టీసీలో కల్లు ఎలా తీసుకెళుతారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ఇదెక్కడి విడ్డూరం.. భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తిన్న భర్త..!
మొత్తంగా ఈ వీడియో వైరల్ అవుతున్న క్రమంలో నెటిజన్లు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి, వేటిని తీసుకెళ్లకూడదో ప్రయాణికులకు మరోసారి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నల్గొండ ఆర్టీసి బస్సు ముందు మహిళ నిరసన
బస్సులోకి కల్లు తీసుకు రావొద్దని డ్రైవర్ చెప్పటం తో ఆగ్రహం
బస్సు ఆపి ఆందోళన చేసిన ప్రయాణికురాలు.@TGSRTCHQ @SajjanarVC pic.twitter.com/FxNmYXk5zh
— Telangana Awaaz (@telanganaawaaz) May 4, 2025