BigTV English

Husband Bites Wife’s Nose: ఇదెక్కడి విడ్డూరం.. భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తిన్న భర్త..!

Husband Bites Wife’s Nose: ఇదెక్కడి విడ్డూరం.. భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తిన్న భర్త..!

Husband Bites Wife’s Nose: భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడో భర్త. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య పట్ల భర్త వ్యవహరించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది.


వివరాల్లోకి వెళ్తే.. కట్టుకున్న భార్య అందంగా ఉండాలని ఏ భర్త కోరుకోడు చెప్పండి. తన జీవితంలోకి రాబోయే సతీమణి అందరికంటే చాలా అందంగా ఉండాలని.. గుణవంతురాలు కావాలని కలలు కంటూ ఉంటాడు. చాలా మందికి ఆ కల నెరవేరుతుంది కూడా. కోరుకున్నట్టే అందమైన భార్య వచ్చిందంటే.. ఇంకేముందు ప్రతిరోజూ చూసుకుంటూ.. భర్త మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకటం తన అదృష్టం అని చెప్పి ఫీలవుతూ ఉంటాడు. ఆమెపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బాధపెట్టకుండా తన భార్యను అల్లారుముద్దుగా చూసుకుంటాడు.

కానీ ఇక్కడ ఓ భర్త మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తన భార్య అందంగా ఉందని దారుణానికి తెగబడ్డాడు. అతడు చేసిన పనికి ఊరు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలా చేశాడేంట్రా బాబు అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు. మరికొందరైతే దుమ్మెత్తిపోస్తున్నారు.


ఇంతకీ ఏం చేశాడంటే.. పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా శాంతీపూర్ పోలీస్టేషన్ పరిధిలోని బేర్పార్ ప్రాంతంలో బాపన్, మధుకాతున్ దంపతులు నివశిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని, తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా.. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది. తన భార్య అందంగా ఉండడంతో బాపన్ తరుచుగా ఆమె ముఖాన్ని, ముఖ్యంగా ఆమె ముక్కును పొగుడుతా ఉండేవాడు. కానీ అదే ముక్కు ఆమెకు శాపంగా మారింది. శుక్రవారం మధుకాతున్ నిద్రపోతున్న సమయంలో ఆమె భర్త అకస్మాత్తుగా ముక్కును కొరికేసి మింగేశాడు.

దీంతో తెల్లవారుజామున మూడు గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మధుకాతున్ అరుపులు కేకలతో  ఇల్లు దద్దరిల్లిపోయింది. దీంతో ఏమైందా అని చుట్టు ప్రక్కలవాళ్లు చూసేసరికి ఆమె ముక్కు, వేలు నుంచి రక్తం కారుతోంది. అనంతరం మధుకాతున్ ఆమె తల్లితో కలిసి పోలీస్టేషన్ కు వెళ్లింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపూర్ పోలీస్టేషన్ కు వెళ్ళి భర్త బాపన్ పై ఫిర్యాదు చేసింది. ఆపై తన భర్త ఎలాంటివాడో పోలీసులకు తెలియజేసింది.

Also Read: తళతళ మెరిసిన వాషింగ్ పౌడర్ నిర్మా.. కారు చీకట్లు కమ్ముకుని ఎలా కనుమరుగైంది?

నా భర్త అప్పుడప్పుడు మధ్యం తాగేవాడని, అప్పుడు నా ముఖం, ముక్కును పొగిడేవాడు, నా ముక్కు కొరికి తింటాడని చెప్పేవాడు. శుక్రవారం రాత్రి అతను అన్నంత పని చేశాడు. అలానే నా ముక్కు అందంగా ఉండడంతో నాపై యాసిడ్ పోస్తానని బెదిరించాడని మధుకాతున్ ఫిర్యాదులో పేర్కొంది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×