BigTV English

Viral Video : చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా? వీడియో వైరల్

Viral Video : చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా? వీడియో వైరల్

Viral Video : వినాయకుడు పాలు తాగడం. అప్పట్లో తెగ హడావుడైన ఉదంతం. గణేష్ విగ్రహాలు పాలు తాగాయి. స్పూన్‌లో పాలు పోసి.. దేవుడి తొండం తగ్గర పెడితే ఆ పాలను పీల్చేసేవి. అలా ఒకటీ రెండు విగ్రహాలు కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది వినాయక విగ్రహాలు అలానే పాలు తాగాయి. ఇది నిజంగా నిజం. అయితే, కొన్ని రోజుల తర్వాత అలా జరగడం ఆగిపోయింది. సైంటిస్టులు ఏవేవో కారణాలు చెప్పారు. ఆ విగ్రహాల్లో సూక్ష్మమైన రంధ్రాలు ఉన్నాయని.. అవి వ్యాక్యూమ్‌లా పని చేసి.. ఆ పాలను లోనికి గ్రహించేవని అన్నారు. అయితే, అవే విగ్రహాలు ఆ తర్వాత ఎందుకు పాలు తాగలేదు? ఇదంతా పక్కన పెడితే…


ఇలాంటి విచిత్ర ఘటనలు, నమ్మలేని నిజాలు చాలానే జరుగుతుంటాయి. కాకపోతే అవన్నీ అంతగా వైరల్ కావు. సోషల్ మీడియా హవాతో ఇటీవల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. నమ్మకాలతో పాటు నాన్‌సెన్స్ కూడా ఎక్కువగానే వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

చెట్టు నుంచి నీళ్లు.. 


అనగనగా ఓ నగరం. ఆ సిటీలో ఓ చెట్టు. రోజూ చూసే చెట్టే. ఎవరూ పట్టించుకునే వారు కాదు. చెట్టే కదాని లైట్ తీసుకునే వాళ్లు. కానీ, ఓ రోజు రాత్రి విచిత్రం జరిగింది. ఆ చెట్టు మొదలు నుంచి నీళ్లు జరజరా కారాయి. ఆ విషయం ఆ ప్రాంతం వారికి తెలిసింది. ఇంక అంతే. ఇది దేవుడి మాయనే అంటూ స్థానికులు తరలివచ్చారు. ఆ నీటిని ప్రసాదంగా, మహిమ ఉన్న జలంగా భావించారు. చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. పూలు సమర్పించారు. ఆ నీటిని తీర్థంగా తీసుకున్నారు. తమ వారి కోసం బాటిల్స్‌లో నింపుకొని పట్టుకెళ్లారు. ఆ రాత్రంతా ఆ ప్రాంతంలో జాతర నడిచింది. ఆ చుట్టు పక్కల ఏరియాల్లో ఉండే వారికి ఆ విషయం తెలిసి.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతోంది. ఇదంతా మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి-చించ్వాడ్‌లో జరిగింది.

ఆ నీళ్ల సంగతి తేల్చేసిన అధికారులు..

చెట్టు నుంచి నీళ్లు ధారలో వస్తున్నాయనే విషయం తెలిసి.. స్థానిక మున్సిపల్ సిబ్బంది ఉదయాన్నే వచ్చి పరిశీలించారు. చెట్టు కింద ఉన్న పైప్ లైన్ పగిలి.. ఆ నీళ్లు చెట్టు తొర్రలోంచి బయటకు వచ్చాయని నిర్థారించారు. అక్కడ చేరిన జనాలను చెదరగొట్టారు. అప్పటి వరకూ అదంతా దేవుడి మహిమ అనుకున్న వాళ్లంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం అవుతాయని భావించిన వాళ్లంతా డిసప్పాయింట్ అయ్యారు. మున్సిపల్ వాటరేనా అనుకుంటూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అందుకే, ఏదైనా నమ్మేముందు కాస్త లాజికల్‌గా ఆలోచించాలని చెబుతారు.

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×