MLA Akhilapriya: ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితమే ఆమె సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఈ రోజు నంద్యాల జిల్లా దొర్పిడు మండలం డబ్ల్యూ. గోవిందిన్నెలో జరిగిన పెద్దమ్మ తల్లి జాతరకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆమెకు మెరుగైన వైద్యం కోసం నంద్యాల జిల్లాకు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: AP Inter Student Incident : తన్మయిని చంపింది వాడే.. ఎందుకు చంపాడంటే.. వీడిన మిస్టరీ..