Viral Video : ఓ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. డ్రైవర్ వచ్చాడు. ఆమె బండి ఎక్కింది. బైక్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే, ఆ డ్రైవర్ చాలా రఫ్ గా బండి నడుపుతున్నాడు. స్పీడ్‌గా వెళ్తున్నాడు. కట్స్ కొడుతున్నాడు. అతని ర్యాష్ రైడింగ్‌కు ఆ యువతి బెదిరిపోయింది. స్లో స్లో అంటూ పదే పదే చెప్పింది. అయినా, అతను ఏం తగ్గలేదు. అలానే డేంజరస్‌గా స్కూటర్ నడుపుతున్నాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. రోడ్డు పక్కన బండి ఆపించింది. స్కూటర్ దిగేసి.. ఆ ర్యాపిడో రైడర్‌తో గొడవకు దిగింది. బండి అంత ర్యాష్‌గా ఎందుకు నడుపుతున్నావు? చెబితే అర్థం కావట్లేదా? అంటూ దురుసుగా మాట్లాడింది. ఆ రైడర్ సైతం ఎదరుతిరిగాడు. ఇద్దరూ తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. మేటర్ ముదిరింది.
యువతిని కొట్టిన ర్యాపిడో డ్రైవర్
ఆ యువతి, ర్యాపిడో రైడర్.. ఇద్దరూ రోడ్డు పక్కన నిలుచుని డైలాగ్ వార్ స్టార్ట్ చేశారు. అడ్డదిడ్డంగా బైక్ ఎందుకు నడుపుతున్నావంటూ ఆ యువతి ప్రశ్నించింది. నా బైన్ నా ఇష్టం అంటూ వాడు దురుసుగా ఆన్సర్ చెప్పాడు. రాష్ డ్రైవింగ్‌తో నాకేమైనా అయితే..? ఆ యువతి క్వశ్చన్ చేసింది. అతడు మరింత రెచ్చిపోయాడు. అలా అలా ఇద్దరి మధ్య మాటల తీవ్రత పెరిగింది. రోడ్డు పక్కనే గొడవ జరుగుతుండటంతో.. అటుగా వెళ్లే వాళ్లు ఆగి చూస్తున్నారు. అమ్మాయి కావడంతో కొందరు కలుగజేసుకుని ర్యాపిడో వాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆ ఇద్దరూ ఎక్కడా తగ్గట్లే. ఆ యువతి కూడా సైలెంట్ అవట్లే. అదే ఫ్లోలో ఓ దురుసు మాట అనేసింది. వాడికి మరింత కోపం వచ్చింది. సడెన్‌గా ఆ యువతి చెంప మీద గట్టిగా కొట్టాడు. దెబ్బకు ఫుట్‌పాత్ మీద నుంచి రోడ్డు మీద పడింది ఆ యువతి. పాపం.. దెబ్బ బాగా తగిలినట్టుంది. అదంతా ఆ పక్కన ఉన్న ఒకతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అంత గట్టిగా దెబ్బ తిన్నాక కూడా ఆ యువతి అతడికి ఏమాత్రం బెదరలేదు. లేచి నిలుచుని ఈసారి మరింత గట్టిగా వాడిని నిలదీసింది. స్పాట్‌లోనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ ర్యాపిడో డ్రైవర్ సైతం తగ్గేదేలే అన్నట్టు అక్కడే ఉన్నాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏదో మాటా మాటా అనుకోవడం వరకు ఓకే కావొచ్చు కానీ, అమ్మాయిని అలా కొట్టడం దారుణం అంటూ కొందరు కుమ్మేస్తున్నారు. ఆమె ఏమని తిట్టిందో.. అందుకే వాడికి అంత కోపం వచ్చి కొట్టి ఉంటాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ కొట్టింది యువతే.. మరో వీడియోలో షాకింగ్ నిజాలు
ఇదంతా బెంగళూరులో జరిగింది. అయితే, ఆ వీడియో వైరల్ అయిన కాసేపటికి మరో సీసీకెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో మరింత ఆసక్తికరంగా ఉంది. మొదట ఆ యువతే ఆ ర్యాపిడో రైడర్‌కు కొట్టింది. బండి దిగగానే తిట్టేస్తూ.. కొట్టేస్తూ.. నానా రచ్చ చేసింది. అతడు కాసేపు ఓపికపట్టాడు. ఆ తర్వాత అతనూ బండి దిగి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అదే టైమ్‌లో ఆమె మాట్లాడిన మాటకు అతనికి చిర్రెత్తుకొచ్చి ఒక్కటి ఇచ్చాడు. ఆ రెండు వీడియోలు గమనిస్తే.. ముందుగా కొట్టింది ఆ యువతే. టపాటపా నాలుగు పీకింది. లాస్ట్‌లో ఆ డ్రైవర్ ఆమెకు ఒక్కటిచ్చాడు. ఆమె కిందపడిపోయిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
బెంగళూరులో ఓవరాక్షన్స్
బెంగళూరులో ఇటీవల ఇలాంటిదే మరో ఘటన తెగ వైరల్ అయింది. ఓ ఆటో డ్రైవర్ మహిళతో గొడవ పెట్టుకునే వీడియో అది. లేట్‌గా వచ్చాడని బుక్ చేసిన ఆటో రైడ్‌ను క్యాన్సిల్ చేసింది ఆ మహిళ. దీంతో ఆ ఆటోవాలాకు చిర్రెత్తుకొచ్చింది. తాను దూరం నుంచి వస్తున్నానని.. ఇంత దూరం వచ్చాక ట్రిప్ క్యాన్సిల్ చేస్తే.. ఆటో గ్యాస్‌కు డబ్బులు ఎవరు ఇస్తారంటూ ఆ మహిళను తిట్టిపోశాడు ఆ డ్రైవర్. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టగా.. లేటెస్ట్‌గా యువతిని ర్యాపిడో డ్రైవర్ చెంప మీద కొట్టడం మరింత వైరల్ అవుతోంది.
A #Rapido driver in Jayanagar, #Bengaluru, attacked a woman after she confronted him about reckless driving. He slapped her so hard that she fell to the ground. The police have initiated an investigation. pic.twitter.com/2bEcSH8QI9
— Ashish (@KP_Aashish) June 16, 2025
#Rapido case – New CCTV footage shows the Rapido customer hitting the Rapido rider/captain twice before he retaliates. The customer had claimed that she was assaulted by the rider for questioning rash driving. pic.twitter.com/waMMqxXsb5
— Harish Upadhya (@harishupadhya) June 16, 2025