Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఈయన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మారుతి(Maruthi) ప్రభాస్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా రాజా సాబ్ సినిమా గురించి ఇందులో హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చిన సమయంలో ప్రభాస్ ఒక దేవుడిలా నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారని తెలిపారు.
పాన్ ఇండియా బుజ్జిగాడు…
ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మంచి హర్రర్ కామెడీ సినిమా చేద్దామని ప్రభాస్ చెప్పగానే నేను భయపడ్డానని మారుతి తెలిపారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈ తరహా జానర్ లో వచ్చాయి. మళ్ళీ ఒక పాన్ ఇండియా స్టార్ట్ తో ఇలాంటి సినిమా చేయటం ఏంటీ? ఇది వర్కౌట్ కాదు, వద్దని చెప్పాలనుకున్నాను. ప్రభాస్ స్వయంగా ఫోన్ చేసి ఈ ప్రాజెక్టు చేస్తున్నామని చెప్పడంతో ఈ సినిమా పనులు మొదలు పెట్టానని తెలిపారు. ఒకప్పుడు బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ టైమింగ్ ఎలా ఉండేదో ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బుజ్జిగాడు ఏంటో చూపిద్దామని నిర్ణయం తీసుకున్నాను.
ఇద్దరిని పెట్టొచ్చు కదా డార్లింగ్…
ఇక ఈ సినిమా విషయంలో హీరోయిన్ల గురించి ప్రభాస్ మాట్లాడుతూ డార్లింగ్ ఈ సినిమాలో నాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టవా అంటూ అడిగారని డైరెక్టర్ తెలిపారు. గత కొన్ని సినిమాలలో తనకు హీరోయిన్లు లేరని, సలార్ సినిమాలో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, కల్కి సినిమాలో కూడా హీరోయిన్ ఉన్నా లేనట్టే ఉంటుంది. ఇక ఆది పురుష్ సినిమాలో రాముడిగా నేనొక చోట సీతగా తను ఒకచోట ఉంది. నా దగ్గర, నా ఇంట్లో ఇద్దరు హీరోయిన్లను పెడతావా? డార్లింగ్ అంటూ నన్ను అడిగారని మారుతి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభాస్ ఇలా అడగడంతో తన వైపు ఎగాదిగా చూసి మీకు ఇద్దరేంటి ముగ్గురినైనా పెడతాను డార్లింగ్ అంటూ ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి తన హర్రర్ ఇంట్లో పడేసాను అంటూ మారుతి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు కాదు ముగ్గురు…
ఇలా డైరెక్టర్ మారుతి చేసిన ఈ కామెంట్స్ విన్న అభిమానులు అయ్యో పాపం ప్రభాస్ హీరోయిన్లతో రొమాన్స్ ఇంతలా మిస్ అవుతున్నారా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం వామ్మో ప్రభాస్ చూడటానికి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ మహా ముదురే అంటూ డైరెక్టర్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్(Nidhi Aggarwal), మాళవిక మోహనన్(Malavika Moganan), రిద్ది కుమార్(Ridhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభిస్తుంది ప్రభాస్ ని ఇలా చూసి చాలా రోజులవుతుందని అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.