IND VS PAK: ఈ ఏడాది చివర్లో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు ఈ ఏడాది చివర్లో భారత్ లో పర్యటించాల్సి ఉంది. కానీ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయా..? లేదా..? అని క్రీడాభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తాజాగా తెరదించింది ఐసిసి. ఇండియా – పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్లను కూడా ఇరుజట్లు మ్యాచ్ లను తటస్థ వేదికలపై నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా మహిళల వన్డే ప్రపంచ కప్ {women’s World Cup 2025} ని కూడా ఇదేవిధంగా నిర్వహించబోతున్నారు.
Also Read: Kohli-ABD: ఆ లేడీ ప్రెగ్నెంట్..తన్నుకున్న కోహ్లీ, డివిలియర్స్.. ముఖం మీదే ఛీ కొట్టాడు ?
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇండియా తో పాటు శ్రీలంకలో కూడా జరగబోతుంది. అయితే రాజకీయ కారణాలవల్ల పాకిస్తాన్ జట్టు భారత్ కి వస్తుందా..? లేదా..? అనే సందిగ్ధత నేపథ్యంలో దీనిపై ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 మధ్య భారత్ – శ్రీలంక వేదికగా జరుగుతుంది. అయితే తాజాగా భారత్ మ్యాచ్ ల షెడ్యూల్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల తేదీల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తర్వాత భారత్.. పాకిస్తాన్ పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్లు మొదటిసారి ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇరుజట్లు ఎప్పుడు..? ఎక్కడ..? తలపడబోతున్నాయో తెలుసుకుందాం.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కి ఆతిథ్యం ఇచ్చే దేశాలు:
భారత్, శ్రీలంక.
మొత్తం మ్యాచ్ లు: 31
{ 28 లీగ్ మ్యాచ్ లు, 3 నాకౌట్ మ్యాచ్ లు}
భారత్ లో వేదికలు:
{ బెంగళూరు: {చిన్న స్వామి స్టేడియం}, గౌహటి {ఏసీఏ స్టేడియం}, ఇండోర్ {హుల్కర్ స్టేడియం}, విశాఖపట్నం {ఏసిఏ – వీడిసిఎ స్టేడియం}.
శ్రీలంకలో వేదికలు:
కొలంబో { ఆర్. ప్రేమదాస్ స్టేడియం}.
మహిళల ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్ వివరాలు:
మంగళవారం: సెప్టెంబర్ 30 భారతదేశం vs శ్రీలంక బెంగళూరు మధ్యాహ్నం 3:00
బుధవారం: అక్టోబర్ 1 ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ ఇండోర్ మధ్యాహ్నం 3:00
గురువారం: అక్టోబర్ 2 బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
శుక్రవారం: అక్టోబర్ 3 ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు మధ్యాహ్నం 3:00
శనివారంP: అక్టోబర్ 4 ఆస్ట్రేలియా vs శ్రీలంక కొలంబో మధ్యాహ్నం 3:00
ఆదివారం: అక్టోబర్ 5 భారతదేశం vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
సోమవారం: అక్టోబర్ 6 న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా ఇండోర్ మధ్యాహ్నం 3:00
మంగళవారం: అక్టోబర్ 7 ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ గౌహతి మధ్యాహ్నం 3:00
బుధవారం: అక్టోబర్ 8 ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
గురువారం: అక్టోబర్ 9 భారతదేశం vs దక్షిణాఫ్రికా వైజాగ్ మధ్యాహ్నం 3:00
శుక్రవారం: అక్టోబర్ 10 న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ వైజాగ్ మధ్యాహ్నం 3:00
శనివారం: అక్టోబర్ 11 ఇంగ్లాండ్ vs శ్రీలంక గౌహతి మధ్యాహ్నం 3:00
అక్టోబర్ 12 ఆదివారం భారత్ vs ఆస్ట్రేలియా వైజాగ్ మధ్యాహ్నం 3:00
సోమవారం: అక్టోబర్ 13 దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ వైజాగ్ మధ్యాహ్నం 3:00
మంగళవారం: అక్టోబర్ 14 న్యూజిలాండ్ vs శ్రీలంక కొలంబో మధ్యాహ్నం 3:00
బుధవారం: అక్టోబర్ 15 ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
గురువారం: అక్టోబర్ 16 ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ వైజాగ్ మధ్యాహ్నం 3:00
శుక్రవారం: అక్టోబర్ 17 దక్షిణాఫ్రికా vs శ్రీలంక కొలంబో మధ్యాహ్నం 3:00
శనివారం: అక్టోబర్ 18 న్యూజిలాండ్ vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
ఆదివారం: అక్టోబర్ 19 భారతదేశం vs ఇంగ్లాండ్ ఇండోర్ మధ్యాహ్నం 3:00
సోమవారం: అక్టోబర్ 20 శ్రీలంక vs బంగ్లాదేశ్ కొలంబో మధ్యాహ్నం 3:00
మంగళవారం: అక్టోబర్ 21 దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ కొలంబో మధ్యాహ్నం 3:00
బుధవారం: అక్టోబర్ 22 ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ ఇండోర్ మధ్యాహ్నం 3:00
గురువారం: అక్టోబర్ 23 ఇండియా vs న్యూజిలాండ్ గౌహతి మధ్యాహ్నం 3:00
శుక్రవారం: అక్టోబర్ 24 పాకిస్తాన్ vs శ్రీలంక కొలంబో మధ్యాహ్నం 3:00
శనివారం: అక్టోబర్ 25 ఆస్ట్రేలియా v శ్రీలంక ఇండోర్ మధ్యాహ్నం 3:00
ఆదివారం: అక్టోబర్ 26 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ గౌహతి మధ్యాహ్నం 3:00
ఆదివారం: అక్టోబర్ 26 ఇండియా vs బంగ్లాదేశ్ బెంగళూరు మధ్యాహ్నం 3:00
బుధవారం: అక్టోబర్ 29 సెమీఫైనల్ 1 (TBA) గౌహతి/కొలంబో మధ్యాహ్నం 3:00
గురువారం: అక్టోబర్ 30 సెమీఫైనల్ 2 (TBA) బెంగళూరు మధ్యాహ్నం 3:00
ఆదివారం: నవంబర్ 2 ఫైనల్ (TBA) కొలంబో/బెంగళూరు మధ్యాహ్నం 3:00
ఊమెన్ క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యుల్ విడుదల pic.twitter.com/HY7l8aMASx
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025