Indian Railways: ముంబై లోకల్ రైళ్లు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తాయి. నిత్యం ఈ రైళ్లు నగరం అంతటా లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతుంది. నగర శివారు ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ, లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. ప్రయాణీకుల రోజు వారీ ప్రయాణాన్ని మరితం సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. రైల్లో కాలు పెట్టేందుకు స్థలం లేక మహిళా ప్రయాణీకులు ఏకంగా రైలు వెలుపల వేలాడుతూ ప్రయాణం చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై రైల్వేశాఖ రియాక్ట్ అయ్యింది.
ఆలస్యం కావడంతోనే అసలు సమస్య!
తాజాగా కళ్యాణ్- ముంబై CST మధ్య ప్రయాణించే రైళ్లో మహిళలు ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేశారు. వీరిలో ఓ మహిళ కేకలు వేయగా, మరొకరు వీడియో రికార్డ్ కాకుండా ఉండటానికి ప్రయత్నించారు. కళ్యాణ్ లేడీస్ స్పెషల్ రైలు 40 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ భారీగా పెరిగింది. రైల్లో కాలు పెట్టే స్థలం లేకపోవడంతో కొంత మంది మహిళలు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. “కళ్యాణ్ నుంచి బయల్దేరాల్సిన లేడీస్ స్పెషల్ రైలు 40 నిమిషాలు ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా మహిళలు ఫుట్ బోర్డుపై వేలాడాల్సి వచ్చింది. కొంత మంది ప్రమాదకర రీతిలో జర్నీ చేశారు” అంటూ ముంబై రైల్వే యూజర్స్ ఎక్స్ ఖాతా నుంచి షేర్ అయ్యింది. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6
— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025
నెటిజన్లు ఏం అన్నారంటే?
ఈ వైరల్ వీడియో ముంబై నగరంలో మెరుగైన ప్రజా రవాణా మౌలిక సదుపాయాల అవసరం గురించి ఆందోళనతో పాటు చర్చకు దారితీసింది. ఈ క్లిప్ మీద రైల్వేసేవా స్పందించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారికి చేరవేశామని వెల్లడించింది. అటు సెంట్రల్ రైల్వే RPFని కూడా ట్యాగ్ చేసి.. ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇక ఈ వీడియో నెటిజన్లు రకరకాలు స్పందించారు. కొంత మంది సదరు ప్రయాణీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని సమర్థిస్తున్నారు. “ప్రజలు ఆఫీసులకు త్వరగా వెళ్లడం నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు. వారు తమ కుటుంబాల కోసం నిత్యం కష్టం పడుతున్నారు. కానీ, ఇలా ప్రయాణం చేయడం వల్ల జరగకూడనిది జరిగితే కుటుంబానికి శాశ్వత భారంగా మార్చే అవకాశం ఉంటుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “దయచేసి ముంబై రైల్వే సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలి. ముంబై లోకల్ రైల్వే నెట్ వర్క్ కు భారీ విస్తరణ అవసరం. రోజు వారీ లోకల్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో అడిగినా రైల్వే అథారిటీ నుంచి సమాధానం రావడం లేదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి ప్రయాణాలు రోజూ జరుగుతున్నాయి. రైలు ప్రారంభం కాగానే డోర్లు క్లోజ్ అయ్యే ఏసీ లోకల్ రైళ్లకు ఎక్కువ ప్రాధానత్య ఇవ్వాలి” అని మరో వ్యక్తి సూచించాడు.
Read Also: ట్రావెల్ ఏజెంట్లలో జాగ్రత్త, ఆ టికెట్స్ మిస్ యూజ్ కావద్దంటూ ఇండియన్ రైల్వే వార్నింగ్!