BigTV English
Advertisement

OTT Movie : అడవిలో మనుషుల్ని వెంటాడి వేటాడి చంపే మాస్క్ మ్యాన్… ట్విస్టులతో అదరగొట్టే భూమిక సిరీస్

OTT Movie : అడవిలో మనుషుల్ని వెంటాడి వేటాడి చంపే మాస్క్ మ్యాన్… ట్విస్టులతో అదరగొట్టే భూమిక సిరీస్

OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లు, సినిమాలు పొటా పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వచ్చింది. ఈ సిరీస్ చివరి వరకూ సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జీ 5 (ZEE5) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘భ్రమ్’ (Bhram). 2019 లో వచ్చిన ఈ మూవీకి సంగీత్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కల్కి కొచ్లిన్, భూమిక చావ్లా, సంజయ్ సూరి, సత్యదీప్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ అలీషా ఖన్నా అనే రొమాంటిక్ నవలా రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక కారు ప్రమాదం తర్వాత స్ట్రెస్ డిజార్డర్ (PTSD) తో బాధపడుతుంది. ఆ తారువాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. 8 ఎపిసోడ్‌లతో ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సిరీస్ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

అలీషా ఖన్నా రొమాంటిక్ నవలా రచయిత్రిగా బాగా పేరు తెచ్చుకుంటుంది. ఆమె తన భర్తతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ గా కూడా ఉంటుంది. ఒక కారు ప్రమాదంలో తన భర్త, పుట్టబోయే బిడ్డను కోల్పోతుంది. ఈ ఘటన ఆమె మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆమె తన జీవితాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి, షిమ్లాలో ఉన్న తన సోదరి అంకితా, ఆమె భర్త పీటర్ ఇంటికి వెళ్తుంది. షిమ్లాలో అలీషాకి, ఆయేషా అనే యువతి నీడలు ఆమెను వెంబడిస్తాయి. ఆమె మొదట్లో తన PTSD వల్ల హాలూసినేషన్స్ అని భావిస్తుంది. కానీ తర్వాత ఆ యువతి 20 సంవత్సరాల క్రితం మరణించిందని తెలుసుకుంటుంది.

ఒక పుస్తకం రాసే ఉద్దేశ్యంతో, ఈ రహస్యాన్ని ఛేదించడానికి అలీషా ప్రయత్నిస్తుంది. ఆమె దర్యాప్తు షిమ్లాలోని కొంతమంది ప్రముఖ వ్యక్తుల వైపు వెళ్తుంది. కానీ వారు ఒక్కొక్కరుగా హత్య చేయబడుతుంటారు. ఒక ముసుగు ధరించిన వ్యక్తి వాళ్ళను చంపుతుంటాడు. ఈ క్రమంలో అలీషా జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. చివరికి ఆయేషా గురించి, అలీషా తెలుసుకుంటుందా ? షిమ్లాలో వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? ఆ ముసుగు ధరించిన వ్యక్తి ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : కప్పు టీ ఇచ్చిన పాపానికి కొంప కొల్లేరు చేసింది … పక్కా ప్లాన్ తో బోల్తా కొట్టించే లేడీ కిలాడీ మావా

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×