BigTV English

Horoscope Today May 13th : ఆ రాశి వారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Horoscope Today May 13th : ఆ రాశి వారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 13న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

వృషభం: ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.


మిధునం: ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధు,మిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

సింహం: స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబసభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థాన చలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం: ఇంట్లో సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

మకరం: పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.

కుంభం: చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

మీనం: ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

 

ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Big Stories

×