Viral Video : తాజ్‌మహల్. ప్రపంచ వండర్. ప్రేమకు చిహ్నం. పాలరాతి వైభవం. చూస్తుంటే కళ్లు తిప్పుకోలేరు. ఆగ్రా నది తీరాన అత్యద్భుతంగా కొలువుదీరి ఉంటుంది. ఆ కట్టడం.. అందులో చెక్కిన నగిషీలు.. చూసి తీరాల్సిందే. అందుకే నిత్యం లక్షల్లో వస్తుంటారు సందర్శకులు. కానీ, అతను అందరిలా కాదు. కేవలం చూసి వదిలేయలేదు. అచ్చం తాజ్ మహల్ లానే ఓ అద్భుతమైన 4 BHK ఇంటిని కట్టించుకున్నారు. ఆ ఇల్లు సేమ్ టు సేమ్ తాజ్ మహల్ లానే ఉంది.
సేమ్ డిజైన్.. కొలతలు కూడా..
డిజైన్ మాత్రమే కాదు… కొలతలు సైతం వర్జినల్ తాజ్ మహల్ నుంచే తీసుకున్నారు. ఆగ్రా కట్టడం కొలతలు మీటర్లలో ఉంటే.. ఈ ఇంటి కొలత ఫీట్లలో ఉంటుంది. అంటే, ఆ తాజ్ మహల్ విస్తీర్ణంలో సరిగ్గా మూడో వంతు ఉంది ఈ తాజ్‌మహల్ హౌజ్. బయటినుంచి చూస్తే ఆ రెండూ ఒకేలా కనిపిస్తాయి. లోపలకెళ్లి చూస్తే.. ఆ ఇంటి ఇంటీరియర్ అదిరిపోతుంది.
లోపల అదుర్స్..
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే, అతని భార్యల కలల స్వరూపం ఈ ఇల్లు. వారు ఓ ప్రముఖ పాఠశాలను నడుపుతున్నారు. ఆ స్కూల్ ఆవరణలోనే ఈ తాజ్‌మహల్ ప్యాలెస్‌ను కట్టుకున్నారు. భవనాన్ని నాణ్యమైన ‘మక్రానా’ రకం పాలరాతితో నిర్మించారు. తాజ్‌మహల్‌కు ఉన్న మాదిరిగానే ఇంటి డోర్.. ఆర్చ్ డిజైన్‌తో వెల్ కమ్ చెబుతుంది. ఇంటి లోపల మొత్తం పాలరాతి ఇంటీరియరే. ఫ్లోరింగ్‌పై చక్కని డిజైన్లు. ఎత్తైన గోడలు. విశాలమైన మెట్లు. పాలరాతి స్తంభాలతో కళ్లు చెదిరేలా ఉంది.
తాజ్‌మహల్ హౌజ్.. ప్రేమ మెసేజ్..
ఆ ఇంటికి మరో ప్రత్యేకత ఏంటంటే.. రెండు వరుసల గోడలు ఉండటం. 9 ఇంచుల వెడల్పైన రెండు గోడలు.. మధ్యలో 2 ఫీట్ కాస్త ఖాళీని వదిలేసి కట్టారు. దానివల్ల ఆ ఇల్లు అన్నికాలాల్లోనూ ఒకే ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఎండాకాలం వేడిని తట్టుకుంటుంది. చలికాలం చలిని ఆపుతుంది. ఇక ఆ ఇంటి పైకప్పు అన్నిటికంటే ఆశ్చర్యకరం. అచ్చం తాజ్ మహల్ డోమ్ మాదిరే కట్టడానికి చాలా కష్టం అయిందట. బిల్డింగ్ పై నుంచి చూస్తే.. వాళ్ల స్కూల్ మొత్తం కనిపిస్తుంది. తాము ఎంతో ఇష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నామని.. ఈ 4 BHK బిల్డింగ్‌ను తన భార్యకు అంకితమని చెబుతున్నారు ఇంటి యజమాని ఆనంద్. ఏ సమస్యకైనా ప్రేమనే సమాధానం అంటూ తాజ్‌మహల్ లాంటి ఇంటితో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.
?utm_source=ig_embed