ICC Rule on Boundary Catch : సాధారణంగా క్రికెట్ లో ప్రస్తుతం కొత్తగా రకరకాల రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ లో ఏ రూల్ ని అయినా మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (MCC) నే ఫైనల్ చేస్తుంది. వాస్తవానికి మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ 1787లో స్థాపించబడింది. ఇది ఒక క్రికెట్ క్లబ్ అనే చెప్పవచ్చు. లండన్ లోని సెయింట్ జాన్స్ వుడ్ లో ఉన్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యజమాని. ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైన క్రికెట్ క్లబ్ లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రతీ సంవత్సరం 400 కంటే ఎక్కువగా మ్యాచ్ లు ఆడుతుంది. క్రికెట్ నియమాలను రూపొందించే సంస్థగా కూడా పని చేసింది. ముఖ్యంగా క్రికెట్ నియమాలను రూపొందించే బాధ్యతను MCC నే చూస్తోంది. ఇందులో వేలాది మంది సభ్యులు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్లబ్. 1814 నుంచి ఇంగ్లాండ్ లోని లండన్ లోని సెయింట్ జాన్స్ వుడ్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఉంది.
Also Read : Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
తాజాగా మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొత్త రూల్ తీసుకురానున్నట్టు సమాచారం. బౌండరీ లైన్ బయటికీ వెల్లి రెండు సార్లు బంతిని పుష్ చేస్తూ పట్టే బన్నీ హాఫ్ క్యాచ్ లు ఇక నుంచి చెల్లవని తెలుస్తోంది. కొత్త నిబంధన అమలులోకి వస్తే.. ఫీల్డర్ బయటికీ వెళ్లి జంప్ చేశాక ఒకే అటెంప్ట్ తో బంతిని పట్టుకొని బౌండరీ లైన్ లోపల ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి క్రికెట్ రూల్స్ ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి మార్లే బోన్ క్రికెట్ క్లబ్ పేరు మనం నిత్యం వింటుంటాం. ఈ క్లబ్ ఆట నియమాలకు సంబంధించిన కోడ్ బాధ్యతలను ఈ క్లబ్ చూసుకుంటోంది. ఇప్పటివరకు 6సార్లు రూల్స్ ను రీకోడ్ చేసింది. వీటి కాపీ రైట్ హక్కులు MCC కే ఉన్నాయి. రూల్స్ లో మార్పులు చేసే అధికారం దీనికి మాత్రమే ఉంది. ICC, అంపైర్స్ అండ్ స్కోరర్స్ అసోసియేషన్ తో చర్చించాకే ఛేంజేస్ చేస్తుంది.
Also Read : Kavya Maran : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కావ్య పాప పెళ్లి.. ఇక రచ్చ రచ్చే!
ముఖ్యంగా మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్, 1788లో క్రికెట్ చట్టాలకు బాధ్యత వహించింది. 1909లో ఐసీసీ స్థాపించబడినప్పుడు దీనిని MCC కార్యదర్శి నిర్వహించేవారు. MCC అధ్యక్షుడే 1989 వరకు ఐసీసీ అధ్యక్ష పదవీని కూడా చేపట్టారు. MCC లో 18వేల మంది పూర్తి స్థాయి సభ్యులు, 5వేల మంది సభ్యులు ఉన్నారు. సభ్యులకు ఓటు హక్కులు ఉన్నాయి. అక్కడ జరిగే అన్ని మ్యాచ్ లను వీక్షించడానికి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లోని పెవిలియన్ ఇతర స్టాండ్లను కూడా ఉపయోగించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 1998 వరకు క్లబ్ సభ్యులు మహిళా సభ్యత్వాన్ని అనుమతించకపోవడం గమనార్హం.