SA Won WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 ( ICC World Test Championship Final 2025 ) మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ( Australia) జట్టును చిత్తు చేసి… చాంపియన్ గా అవతరించింది సౌత్ ఆఫ్రికా ( South Africa). లండన్ లోని లార్డ్స్ వేదికగా ( Lord’s, London ) జరిగిన ఈ మ్యాచ్ లో… 5 వికెట్ల తేడాతో విజయం సాధించి… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను ఎగరేసుకుపోయింది దక్షిణాఫ్రికా. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా జట్టును టెంబ బవుమా ( Temba Bavuma) రఫ్పాడించాడు. ఒంటి చేత్తో జట్టును ముందుకు తీసుకువెళ్లి… తన స్టైల్లో జట్టును చాంపియన్ గా నిలిపాడు. ఫైనల్స్ లో అరివీర భయంకరంగా ఆడే కంగారులకు కంగారు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2025 ఫైనల్ మ్యాచ్ గెలిచి ఛాంపియన్ గా గెలిచింది దక్షిణాఫ్రికా.
Also Read: Shubman Gill: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న శుభ్‌మన్ గిల్… ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ ట్రోలింగ్
దక్షిణ ఆఫ్రికా చేతిలో చావు దెబ్బ తిన్న ఆస్ట్రేలియా
ఐసీసీ ఫైనల్ మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఆస్ట్రేలియా జట్టును సఫారీలు మాత్రం చిత్తు చేశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. తక్కువ అంచనా వేసి… ఫైనల్లో ఆడిన ఆస్ట్రేలియాకు నరకం చూపించింది దక్షిణాఫ్రికా. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో.. 56.4 ఓవర్లు ఆడి 212 పరుగులు చేసింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కాస్త తడబడింది.
దీంతో 65 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా టీం రెండవ ఇన్నింగ్స్ లో 207 పరుగులకు కుప్పకూలింది. ఇక ఆటో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో ఫ్లాఫై… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బాగా రాణించింది. మొదటి నించిలో దక్షిణాఫ్రికా జట్టు 57.1 ఓవర్లలో 138 పరుగులకు అలౌట్ అయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి సీను మారిపోయింది. ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా టైటిల్ గెలుచుకుంది.
Also Read: WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?
ఐడెన్ మార్క్రమ్ ఒంటరి పోరాటం
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా డేంజర్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు పడిపోతున్న కూడా… జట్టును ఆదుకున్నాడు. రెండవ ఇనింగ్స్ లో 207 బంతులు ఎదుర్కొని 136 పరుగులు సాధించి చివరలో అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 14 బౌండరీలు ఉన్నాయి. మూడవ రోజు అలాగే నాలుగవ రోజు… జట్టు కోసం నిలబడి మ్యాచ్ గెలిపించాడు. కానీ చివరలో ఐడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోవడమే బాధాకరం. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా కూడా రాణించాడు.
27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్
1998 సంవత్సరంలో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందుకుంది.