BigTV English
Advertisement

Job Rules: ఉద్యోగులకు వింత రూల్స్.. వాళ్లను కౌగిలించుకోవాలి, రాత్రిళ్లు రోడ్డుపై మోకాళ్లు వేయాలి.. ఎందుకంటే?

Job Rules: ఉద్యోగులకు వింత రూల్స్.. వాళ్లను కౌగిలించుకోవాలి, రాత్రిళ్లు రోడ్డుపై మోకాళ్లు వేయాలి.. ఎందుకంటే?

ప్రపంచంలోనే సగం వింతలు చైనాలోనే జరుగుతాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చైనాలో మరొక విచిత్రమైన సంఘటన జరిగింది. చైనాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు వింత డిమాండ్ ను ఇచ్చింది. టీమ్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులంతా కాలుతున్న కాటన్ బాల్స్‌ను నోట్లో వేసుకొని ఆర్పాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.


రోంగ్ రాంగ్ అనే సోషల్ మీడియా యూజర్ తొలిసారి ఈ విషయాన్ని బయటపెట్టారు. అతను ఆ సంస్థలోనే పనిచేశాడు. తన ఉద్యోగం కోసం కాలుతున్న దూదిని నోట్లో పెట్టి ఆపాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. కానీ అందులో పాల్గొనడం తనకు ఇష్టం లేదని తెలిపాడు. దాదాపు 60 మంది ఉద్యోగులు ఆ వింత పనిలో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

చైనీస్ మీడియా చెబుతున్న ప్రకారం ఈ కంపెనీ ఈశాన్య చైనాలో ఉంది. అది ఒక విద్యాసంస్థ. ఆ సంస్థ తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, వారిలో భయాన్ని పోగొట్టేందుకు టీమ్ బిల్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందుకోసమే వారిలో ఉన్న భయాన్ని తొలగించడానికి వారికి కాటన్ బాల్స్ కు నిప్పు పెట్టి ఇచ్చింది. మండుతున్న ఆ కాటన్ బాల్స్ ను నోట్లో పెట్టి ఆర్పమని కోరింది. కొంతమంది ఆ పని చేయగలిగారు. మరి కొంతమంది భయంతో చేయలేకపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బయటపెట్టిన రోంగ్ రాంగ్ మాత్రం ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. అది తనకు చాలా అవమానకరంగా అనిపించిందని వెల్లడించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించే ఈ పనిని పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందని అతడు వివరించారు.


చెత్త డబ్బాను ముద్దు పెట్టుకోమని

చైనాలో ఇలాంటి చెత్త పనులు చేయించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా తూర్పు చైనాలోని జింగ్ ప్రాంతంలో ఉన్న ఒక కంపెనీ తన ఉద్యోగులను చెత్త డబ్బాలను ముద్దు పెట్టుకోమని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ధైర్యం పెరుగుతుందని చెబుతుంది. అలాగే తమకు తెలియని అపరిచితులను కౌగిలించుకోమని కూడా బలవంతం చేసింది. అలాగే ఉద్యోగులను ఒక్కొక్కరిగా ఎత్తు నుంచి కిందకు కళ్ళు మూసుకుని దూకేయమని కూడా కోరింది. కింద ఉన్న సహోద్యోగులు వారిని పట్టుకునేందుకు వీలుగా ఎత్తు నుంచి కింద పడాలని చెప్పింది. ఇలాంటి పనుల వల్ల కొంతమంది గాయాలు పాలయినట్టు కూడా వార్తలు వచ్చాయి.

మరొక సందర్భంలో ఉద్యోగులకు పెట్టిన ఆటలో ఓడిపోయినందుకు శిక్షగా ఉద్యోగులు రాత్రిపూట వీధిలో మోకాళ్లపై నడిపించే శిక్షణ కూడా విధించినట్టు తెలుస్తోంది. కంపెనీలు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా చైనాలోని కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా జరిగిన సంఘటనలో నిప్పు బంతులను మింగించేందుకు ఉద్యోగులు చేత రిహార్సల్స్ కూడా చేయించారట. ఆ ప్రాక్టీస్ తో అసౌకర్యంగా ఉన్న ఉద్యోగులు తమ ఉద్యోగం పోతుందన్న భయంతో నోటితో ఆపేందుకు ఆ స్టంట్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే 70 లక్షల మందికి పైగా చూశారు. వారంతా కూడా ఆ కంపెనీ చర్యలను విపరీతంగా విమర్శించారు. ఇలాంటి ప్రమాదకరమైన టీమ్ బిల్డింగ్ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగుల్లో మానసికంగా ధైర్యాన్ని నింపితే చాలని పలువు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రూ.100 నోటుకు రూ.56 లక్షలా? మీ దగ్గర ఉందా?

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×