BigTV English

OG Update : ‘ఓజి’ మేకర్స్ కీలక నిర్ణయం… సెట్లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టేది అప్పుడే…

OG Update : ‘ఓజి’ మేకర్స్ కీలక నిర్ణయం… సెట్లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టేది అప్పుడే…

OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG) గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా కంటే ముందే పవన్ పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) తెరపైకి రాబోతోంది అనిపిస్తోంది. ఇక ‘ఓజీ’ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉండడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.


పవన్ దగ్గరకు ‘ఓజీ’ మేకర్స్

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజి’ (They Call Him OG). ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా 15 రోజులు బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ‘ఓజి’ మేకర్స్ త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కలిసి, దీనికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో బజ్ వినిపిస్తోంది. నెక్స్ట్ వీక్ ‘ఓజి’ మేకర్స్ పవన్ కళ్యాణ్ ని బ్యాలెన్స్ షూటింగ్ విషయమై కలుస్తారని, ఒకవేళ ఆయన డేట్స్ ఇస్తే గనక పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాతే ‘ఓజి’ సెట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. సంక్రాంతి తరువాతే ఆ 15 రోజుల షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.


సుజీత్ పై ప్రశంసలు 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ముంబై షెడ్యూల్లో ఈ సినిమా కోసం షూటింగ్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ముంబై షెడ్యూల్ జరుగుతున్న టైంలో రాత్రి ఒంటిగంట దాకా గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఉదయాన్నే 6 గంటలకు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసేవారట. ఇక పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ విషయంలో సుజిత్ వర్క్ తో సంతోషంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా నిర్మాత డివివి దానయ్య కూడా ‘ఓజి’ (They Call Him OG) కాపీతో ఇంప్రెస్ అయ్యారని, దీంతో డైరెక్టర్ సుజిత్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా ఆఫర్ చేశారని అంటున్నారు. ఇక ‘ఓజి’ మూవీ పవన్ కళ్యాణ్ కి బెస్ట్ మూవీ కాబోతోందని నడుస్తున్న టాక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.

అఖిరా ఎంట్రీ 

మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తయ్యాక, పవన్ కళ్యాణ్ ‘ఓజి’ మూవీని కూడా పూర్తి చేయబోతున్నారు. అనంతరం హరిష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. ఇక ‘ఓజి’ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఈ మూవీ గురించి పవర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×