BigTV English

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

Rohit Sharma Lamborghini : టీమిండియా వన్డే కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇటీవలే ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ లో భాగంగా 5వ టెస్ట్ ఓవల్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. లండన్  లోని ఓవల్ వేదిక లో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ కి హాజరై.. యశస్వీ జైస్వాల్ సెంచరీ చేయడంతో అతన్ని అభినందించాడు. అలాగే ఆ సమయంలో యశస్వికి సైగలతో ధైర్యం కూడా చెప్పాడు రోహిత్. రెండు నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ నకు వెళ్లి  స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఇటీవల రోహిత్ శర్మ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయగా. ఆ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి తాజాగా డెలివరీ అయింది. ఆ కారు కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read :  NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

లగ్జరీ కారును కొనుగోలు చేసిన రోహిత్ 


ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారి సంస్థ లంబోర్గిని నుంచి ఓ సూపర్ కారును రోహిత్ శర్మ కొనుగోలు చేశాడు. ఆరెంజ్ కలర్ లంబోర్గిని ఉర్సు ఎస్ఈ కారును కోనుగోలు చేశాడు. భారతదేశంలో ఈ కారు ఎక్స్ -షో రూం ధర రూ.4.57 కోట్లు. ముంబైలో దీని ఆన్ రోడ్డు ధర దాదాపు రూ.5.25 కోట్లు. అదేవిధంగా ఈ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ విషయంలో రోహిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. కొత్త కారుకు కాస్త కొత్తగా ఆలోచించి 3015 నెంబర్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఇక ఆ నెంబర్ కి కూడా ఓ ప్రత్యేకత ఉంది.ఆప్రత్యేకత ఏంటంటే..?

కూతురు, కుమారుడి మీద ప్రేమతో

రోహిత్ కూతురు సమైరా డిసెంబర్ 30న జన్మించింది. కొడుకు అహన్ నవంబర్ 15న జన్మించాడు. వీరిద్దరి బర్త్‌డేలు కలిసి వచ్చేలా తన కొత్త కారుకు 3015 నెంబర్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా రోహిత్‌ లంబోర్గిని కారు ఉపయోగించాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ 264. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రపంచరికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆ 264 పరుగులకు గుర్తుగా తన కారుకు ఆ నెంబర్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తరువాత రోహిత్ శర్మ 2027లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. వారి కోరిక ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా కనిపించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 2027లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ లో యువతకు అవకకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్రణాళికలు చేస్తుంది.

 

Tags

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×