సడెన్ గా సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కంగారులో ఆ ప్రయత్నం చేయలేం. ఫలితంగా ఆదపను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఉటాలో జరిగిన రైలు ప్రమాదాన్ని చూస్తే, మీరూ నిజమే అని అనకతప్పదు. తాజాగా ఉటాలో ఘోర రైలు ప్రమాదం జరింది. ఈ ప్రమాదంలో SUV కారు పూర్తి ధ్వంసం అయ్యింది. ప్రమాద తీవ్రతకు రైల్వే గేట్ కుప్పకూలింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నివారించే ప్రమాదం అయినప్పటికీ..
ఉటాలోని లేటన్ లో ఓ SUV కారు రోడ్డు మీద వెళ్తున్నది. సరిగ్గా రైల్వే ట్రాక్ దాటే సమయంలో రైలు గేటు పడింది. అప్పటికే కారు ట్రాక్ మీదికి వెళ్లింది. వెనక్కి వెళ్దాం అని ప్రయత్నించినప్పటికీ రైల్వే గేట్ పడటంతో సాధ్యం కాలేదు. కాస్త బలంగా వెనక్కి వెళ్తే రైల్వే గేట్ కూలిపోయే అవకాశం ఉండటంతో డ్రైవర్ ఆ ప్రయత్నం చేయలేదు. కారు అక్కడే ఆపాడు. అప్పటికే రైలు దూసుకు రావడంతో కారు నడుపుతున్న వ్యక్తి వెంటనే రైలు దిగి వెనక్కి పరిగెత్తాడు. కాసేపట్లోనే ప్యాసింజర్ రైలు దూసుకొచ్చింది. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముక్కలు ముక్కలు అయ్యింది. ఈ వీడియోను కాలిన్ రగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే సుమారు 8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
కంగారే ప్రమాదానికి అసలు కారణం
ఈ వీడియోను గమనిస్తే.. డ్రైవర్ కంగారే ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి రైల్వే గేట్ పడినప్పటికీ ఆయన అలాగే ముందుకు వెళ్లిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఇండియాలో మాదిరిగా రోడ్ మొత్తం బ్లాక్ కాలేదు. ఎటువైపు అయితే, వాహనాలకు వెళ్తాయో అదే రూట్లో లో రైల్వే గేట్లు ఏర్పాటు చేశారు. ఈ కారు డ్రైవర్ ముందుకు వెళ్లిన తర్వాత రైల్వే గేట్ పడిన నేపథ్యంలో ఆగకుండా వెళ్లిపోతే ఏ ప్రమాదం జరిగేది కాదు.
NEW: Utah driver jumps out of their car at the last moment before the vehicle is demolished by an oncoming train in Layton, Utah.
Hear me out… the individual could have just driven forward.
A white SUV could be seen getting rear-ended as it quickly came to a stop as the… pic.twitter.com/yLy2fZUinY
— Collin Rugg (@CollinRugg) February 12, 2025
Read Also: భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..
లక్ష డాలర్ల నష్టం వాటిల్లిందన్న ఉటా అధికారులు
అటు ఈ ప్రమాదంపై ఉటా అధికారులు స్పందించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం సంతోషకరమన్నారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదన్నారు ఉటా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గవిన్ గుస్టాఫ్సన్. రైల్వే గేట్ పడినా, డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లి ఉండాల్సిందన్నారు. లేదంటే రైల్వే గేట్ ను డ్యామేజ్ చేసినా పెద్దగా నష్టం కలిగేది కాదన్నారు. డ్రైవర్ షాక్ లో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు రైల్వే గేట్ డ్యామేజ్ అయ్యిందన్నారు. అటు రైలుకు ఏకంగా లక్ష డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
Read Also: డైలీ విమానంలో మలేషియా వెళ్లి పనిచేస్తున్న భారత మహిళ.. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ!