BigTV English

Petrol Offers in Hyd: హైదరాబాదీలకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే పెట్రోల్, ఈ తేదీ లోపే ట్యాంకులు నింపేసుకోండి

Petrol Offers in Hyd: హైదరాబాదీలకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే పెట్రోల్, ఈ తేదీ లోపే ట్యాంకులు నింపేసుకోండి

Petrol Offers in Hyd: హైదరాబాద్ నగర వాసులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత్ పెట్రోలియం కోరింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 అర్దరాత్రి వరకు అమలులో ఉంటుందని, వాహనదారులు ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఈ ప్రకటన సారాంశం. ఇంతకు ఏంటా గుడ్ న్యూస్ తెలుసుకుందాం.


హైదరాబాద్ నగరంలో ఉన్న వాహనాల సంఖ్య ఒక్కసారిగా చెప్పాలంటే కళ్లు బైర్లు కమ్మేస్తాయి. బైక్స్, కార్లు, ఇలా ఎన్నో రకాల వాహనాలు నగరంలో ఉన్నాయి. ప్రతి ఇంటికీ బైక్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే హైదరాబాద్ నగర రహదారులను ఎప్పుడూ చూసినా, నిరంతరం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. దీనితో పెట్రోల్, డీజిల్ వ్యాపారం కూడ జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కూడ భారీ వాహనాల క్యూ కనిపిస్తుంది. ఇక వీకెండ్ సమయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగం కూడ అధికంగా ఉంటుంది.

బైక్ కదలాలంటే పెట్రోల్ తప్పక ఉండాల్సిందే. చుక్క పెట్రోల్ లేకున్నా బైక్ ఒక్కడుగు కూడ వేయదు. అందుకే నగరంలోని వాహనదారులు తమ వాహనానికి ఇంధనం ఫుల్ చేయడంలో ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటి వాహనదారుల కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. తమ పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారుల కోసం గొప్ప అవకాశాన్ని కల్పించినట్లు తెలిపింది. తమ కంపెనీ పెట్రోల్ బంకులలో రూ. 200 లేదా అంతకంటే ఎక్కువ పెట్రోల్ పోయిస్తే 2 శాతం అదనపు ఇంధనాన్ని పొందవచ్చని ప్రకటన జారీ చేసింది.


ఈ ఆఫర్ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, అది కూడ ఎంపిక చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పంపుల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని కూడ తెలిపింది. అలాగే స్పీడ్ పెట్రోల్ వినియోగించే వాహనదారులకు కూడ ఈ అవకాశం ఉంటుందట. అయితే ఈ అవకాశం మాత్రం కేవలం డిజిటల్ లావాదేవీలపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ హైదరాబాద్ నగరంలో కాక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉందని ఎర్రమ్ మంజిల్‌ వద్ద గల పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న శ్రీను తెలిపారు.

Also Read: BRS Pink Book: టీడీపీని కాపీ కొట్టిన బీఆర్ఎస్.. పింక్ బుక్ ఓపెన్?

పథకం కాలంలో గరిష్ట ప్రోత్సాహక మొత్తం ప్రతి లావాదేవీకి రూ. 120 ఉంటుందని, కస్టమర్ ఒక రోజులో UPI IDకి గరిష్టంగా రెండు, ఒక నెలలో UPI IDకి గరిష్టంగా నాలుగు, పథక కాలంలో UPI/VPA IDకి గరిష్టంగా 10 లావాదేవీలపై అదనపు ప్రోత్సాహకాలను పొందే అవకాశం ఉంది. ఆఫర్ అందుబాటులో ఉన్న రిటైల్ పెట్రోల్ బంక్ ల జాబితా కోసం www.bharatpetroleum.in > Bharat Petroleum for >Your Corner > Contest Corner సైట్ ను సంప్రదించాలని కోరారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. 2 శాతం అదనపు ఇంధనాన్ని పొంది, డబ్బు ఆదా చేసుకోవచ్చని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. మరెందుకు ఆలస్యం.. బైక్ అలా తిప్పేసి, ఇలా పెట్రోల్ నింపుకుందాం!

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×