Singer Usha: సినీ పరిశ్రమలో కోల్డ్ వార్ అనేది సహజం. నటీనటుల మధ్యే కాదు.. దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్.. ఇలా అందరి మధ్య ఈ కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం సింగర్ ప్రవస్తి.. ఎమ్ఎమ్ కీరవాణి, సునీత లాంటి సీనియర్ సింగర్స్‌పై చేసిన ఆరోపణల తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా కోల్డ్ వార్ అనేది జరుగుతుందని, అక్కడ కూడా జూనియర్ సింగర్స్‌కు అన్యాయం జరుగుతూ ఉంటుందనే విషయం బయటికొచ్చింది. ఇదే సందర్భంలో సింగర్ ఉషా పాత ఇంటర్వ్యూ ఒకటి బయటికొచ్చింది. అందులో సునీతతో తనకు ఉన్న మనస్పర్థల గురించి కామెంట్ చేసింది ఉషా. అసలు సునీత, ఉషా మధ్య ఏం జరిగిందో వివరించింది.
బాధగా అనిపించింది
టాలీవుడ్‌లోకి సునీత, ఉషా దాదాపు ఒకే సమయంలో సింగర్స్‌గా అడుగుపెట్టారు. కానీ సునీతకు వచ్చినంత ఫేమ్, పాపులారిటీ ఉషాకు రాలేదు. తను కేవలం బుల్లితెర షోలకు జడ్జిగా మాత్రమే పరిమితమయ్యింది. ఒకప్పుడు సునీత, ఉషా ఒకే సింగింగ్ షోలో కలిసి పనిచేశారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఉషా గుర్తుచేసుకుంది. అప్పటినుండి వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, ఎప్పుడూ కలిసినా మంచిగా పలకరించుకుంటామని, ఒకసారి ఎయిర్‌పోర్టులో కలిసినప్పుడు సెల్ఫీలు కూడా తీసుకున్నామని చెప్పుకొచ్చింది ఉషా. కానీ సునీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తనపై చేసిన వ్యాఖ్యలు తనకు బాగా బాధను కలిగించాయని గుర్తుచేసుకుంది.
లిమిట్స్ ఉంటాయి
‘‘సునీతకు, నాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. కానీ తను ఇంటర్వ్యూలో ఎందుకు ఒకరంటే ఒకరికి పడదు అని చెప్పిందో తెలియదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పింది నమ్మాలా? పర్సనల్‌గా నాతో టైమ్ స్పెండ్ చేసింది నమ్మాలా? తెలియడం లేదు. నేను ఏదైనా తప్పు చేసుంటే ఏమైంది అని అడగాలి. కానీ మాట్లాడుకునేటప్పుడు మేము బాగానే మాట్లాడుకుంటున్నాం. అసలు మా ఇద్దరికీ పడదు అనే పదం ఎలా చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. నేనైతే ఎవరి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లను. నాకంటూ లిమిట్స్ పెట్టుకుంటాను. ఒక మ్యూజీషియన్‌గా పాటలు పాడడానికే వచ్చాను. అసలు కాంట్రవర్సీల్లో పాయింట్ లేదు’’ అంటూ వాపోయింది ఉషా.
Also Read: సింగర్ ప్రవస్తికి జరిగింది అన్యాయమే.. ఎట్టకేలకు కీరవాణి ఓపెన్.?
పాజిటివ్‌గా తీసుకునేది
‘‘ఇప్పటివరకు సునీత (Sunitha) ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే నాకు అంత అవసరం ఉందని అనిపించలేదు. నేను సీనియర్ అన్నట్టుగా ప్రవర్తించను. జూనియర్స్‌తో కూడా కలిసిపోతాను. నేను, సునీత ఒకరిని ఒకరం ఇమిటేట్ చేసుకునేవాళ్లం. తను కూడా ఎప్పుడూ పాజిటివ్‌గానే తీసుకునేది’’ అంటూ కాసేపు సునీతను ఇమిటేట్ చేసి అలరించింది ఉషా (Usha). తను మాట్లాడిన మాటలను బట్టి చూస్తే సునీతకు ఇండస్ట్రీలోని దాదాపు ప్రతీ సింగర్‌తో సమస్య ఉందా అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రవస్తి కాంట్రవర్సీ ఇంకా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తుండగా సునీత కూడా ఎప్పటికప్పుడు తనకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు ఇస్తోంది.