Mohammad Rizwan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) జరుగుతున్న నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL )కొనసాగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను దెబ్బకొట్టేందుకు.. కక్ష కట్టి మరీ అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ కొనసాగిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వాస్తవానికి ఐపీఎల్ టోర్నమెంట్ కు ఆదరణ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ప్రతికారం కోసం పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో… ఆ టోర్నమెంట్లో అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు చూసి జనాలు ఘోరంగా నవ్వుకుంటున్నారు.
Also Read: RCB Captain In Tirumala: తిరుమలలో RCB ప్లేయర్ల పూజలు.. ‘ఈ సాలా కప్ నామ్దే’
పెప్సీ లోగోను పీకేసిన మహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు అనేక రకాల సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వికెట్ తీయగానే బౌలర్ రెచ్చిపోవడం… అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ రూపంలో హెయిర్ డ్రాయర్లు ఇవ్వడం లాంటి సంఘటనలు మనం చూసాం. అయితే తాజాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుత కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్… ఓ వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ టీం కు స్పాన్సర్ గా ఉన్న పెప్సీ… కంపెనీకి సంబంధించిన లోగోను పీకి పారేశాడు మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan).
బాటిల్ పై లేబర్ పీకేసిన మహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Pakistan Super League 2025 Tournament ) నేపథ్యంలో… కాస్త అసంతృప్తిగా ఉన్న మహమ్మద్ రిజ్వాన్ పెవిలియన్ వైపు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడే పెప్సీ కంపెనీకి సంబంధించిన డ్రింక్స్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ తీసి తాగే నేపథ్యంలో… బాటిల్ మూత తీయకుండా నేరుగా పెప్సీ లేబల్… తొలగించేశాడు మహమ్మద్ రిజ్వాన్. ఆ తర్వాత ఆ బాటిల్ తాగేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ మహమ్మద్ రిజ్వాన్ ను ఏకీపారేస్తున్నారు.
బాటిల్ పైన ఉన్న లోగో కాదు.. దమ్ముంటే నీ చాతి పైన ఉన్న పెప్సీ లోగో తీసేయ్… అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెప్సీ కంపెనీ మీకు స్పాన్సర్ గా ఉంది… అలాంటి పెప్సీ ని అవమానిస్తావా అంటూ మండిపడుతున్నారు. పెప్సీ లేకపోతే పాకిస్తాన్ జట్టును చూసేవాడే ఉండడు.. మీకు వాళ్లు పెట్టే డబ్బులు దండగ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, పెప్సీ లేబల్… తొలగించేసిన మహమ్మద్ రిజ్వాన్ పై యాక్షన్ తీసుకునేందుకు PCB చర్యలు తీసుకోనుందని అంటున్నారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
Also Read: Kuldeep Slaps Rinku: రింకు సింగ్ చెంప పగులగొట్టిన కుల్దీప్ యాదవ్.. ఇదిగో వీడియో
Mohammad Rizwan is such a Hypocrite 🤐
~ There is such a big 'PEPSI' logo on the chest, and he is removing the 'PEPSI' label from a small bottle 😯
~ What's your take on this 🤔 pic.twitter.com/6hcCqzQS14
— Richard Kettleborough (@RichKettle07) April 29, 2025