BigTV English
Advertisement

Viral Video: దేవుడా.. ట్రక్కు కదిలిందో లేదో గొయ్యిలో పడిపోయింది.. షాకింగ్ వీడియో

Viral Video: దేవుడా.. ట్రక్కు కదిలిందో లేదో గొయ్యిలో పడిపోయింది.. షాకింగ్ వీడియో

Viral Video: కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ అయితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. నిద్ర మత్తులో వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగిన ఘటనలు చూసే ఉంటాం. అయితే కొన్ని సార్లు జరిగే ప్రమాదాలు ఎవరి ప్రమేయం లేకుండానే జరుగుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ సెప్టిక్ ట్యాంకర్ ఉన్నట్టుండి లోయలో పడింది. అప్పటి వరకు అక్కడే ఆగి ఉన్న ఆ ట్యాంకర్ నెమ్మదిగా కదిలించగా భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ ట్యాంకర్ ఒక్కసారిగా అందులో పడిపోయింది.


పూణెలోని సమాధాన్ చౌక్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది ప్రకృతి విపత్తు లేక ప్రమాదమా అనేది అర్థం కాకుండా పోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూణెలోని మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన ఓ ట్రక్కు ఒక్కసారిగా గోతిలో పడిపోయింది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం అప్పటి వరకు ఆ స్థలంలో ట్రక్కు ఆగి ఉంది. అయితే అక్కడి నుంచి పని పూర్తి చేసుకుని డ్రైవర్ ట్రక్కును తీయడానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలో కాస్త ట్రక్కును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీంతో ట్రక్కుతో పాటు అక్కడే పక్కన ఉన్న రెండు బైకులు కూడా గొయ్యి ఏర్పడి అందులో పడిపోయాయి.

ఈ తరుణంలో ట్రక్కులో ఉన్న డ్రైవర్ అందులో నుంచి క్షేమంగా బయటికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి అక్కడ గొయ్యి ఏర్పడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు అందరూ గుమిగూడారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. సమాధాన్ చౌక్ లోని సిటీ పోస్ట్ ఆవరణలో వెలుగుచూసింది. అక్కడ టాయిలెట్స్ క్లీన్ చేసిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు.


 

Related News

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Big Stories

×