BigTV English

Ring In Biryani: బిర్యానీలో ఉంగరం.. తింటుండగా ప్రత్యక్షం.. కంగుతిన్న కస్టమర్

Ring In Biryani: బిర్యానీలో ఉంగరం.. తింటుండగా ప్రత్యక్షం.. కంగుతిన్న కస్టమర్
Ring In Biryani
Ring In Biryani

Ring In Biryani:బిర్యానీ అంటే ఇష్టం ఉండని వారెవరు ఉండరు. అందులోను హైదరాబాదీ బిర్యానీకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రపంచదేశాలకు అద్భుతమైన బిర్యానీని హైదరాబాద్ పరిచయం చేసింది. సుగంద ద్రవ్యాలను ఉపయోగించి.. అద్భుతమైన మసాలాలతో బిర్యానీని తయారుచేస్తుంది. ఇదే రెసిపీని దాదాపు దేశ వ్యాప్తంగా వాడుతుంటారు. దీంతో అన్నిటికంటే బిర్యానీకే లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఏ పండుగలు వచ్చినా ముందుగా బిర్యానీనే గుర్తొస్తుంది. పార్టీలు, మీటింగ్ లు, డేటింగ్ లువంటి ప్రోగ్రాంలోను బిర్యానీ తప్పక ఉండాల్సిందే.


బిర్యానీ మీద పెరుగుతున్న ఆదరణతో రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్లు(స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్)పై ఎక్కడ పడితే అక్కడ చౌకగా అమ్మకాలు జరుపుతున్నారు. కేవలం రూ. 60 లకే బిర్యానీ అనే బోర్డింగులు కూడా చూస్తుంటాం. అంతేకాదు రెస్టారెంట్లు, హోటళ్ల ఓపెనింగ్ సమయాల్లో కూడా రూ.1 కే బిర్యానీ అని కొన్ని చోట్లలో ఫ్రీగా కూడా పంపిణీ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ బిర్యానీలే కాక ఇతరత్ర ఆహారపదార్థాల అమ్మకాలు జరుపుతుండడంతో నాణ్యత తగ్గిపోతుంది. కనీసం వాటిలో ఏం వేసి వండుతున్నారో కూడా చూడకుండా కేవలం డబ్బుల కోసం ఆలోచించి అమ్మకాలు జరిపిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో బిర్యానీలో బొద్దింకలు, బల్లులు, సాలెపురుగులు, ఈగలు, వెంట్రుకలు వంటివి ప్రత్యక్షమైన రోజులు కూడా ఉన్నాయి.

బిర్యానీలు ఎగబడి తింటున్నారనే ఆలోచనలతో ప్రజల ప్రాణాలతో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు చెలగాటం ఆడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా అతడి బిర్యానీలో ఉంగరం కనిపించింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. మంథనిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ఘటన వెలుగుచూసింది. కొంతమంది యువకులు కలిసి బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ బీర్, రెండు బిర్యానీలు సహా ఇతర ఆహారపదార్థాలను ఆర్టర్ చేసుకున్నారు. కాసేపటి తర్వాత వారి ఆర్డర్‌ను సప్లయర్ తీసుకువచ్చి వడ్డించాడు. ఆ తర్వాత బిర్యానీ తినడం ప్రారంభించిన యువకులు షాక్ తిన్నారు.


బిర్యానీ తింటుండగా ఓ యువకుడి చేతికి ఏదో గట్టి పదార్థం తగిలింది. ఏంటి ఏదో గట్టిగా తగులుతుందని తీసి చూసేసరికి అది ఉంగరం అని తెలిసింది. వెంటనే ఆ ఉంగరాన్ని బయటకు తీసి హోటల్ యజమాని, వెయిటర్లను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో ఉంగరం రావడం ఏంటని వారిని నిలదీశారు. వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే హోటల్ యాజమాన్యం వారికి ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్ధంగా నిలబడిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Related News

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Big Stories

×